బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం( Jagathi Madam ) పాత్రలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నారు నటి జ్యోతి రాయ్( Jyothi Rai ) .ఈమె కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి గుప్పెడంత మనసు( Guppedantha Manasu ) సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.
ఈ సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి ఈమె చాలా పద్ధతిగా కనిపించేవారు కానీ తనలో మరో కోణం ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది.
పొట్టి పొట్టి దుస్తులను ధరించి పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.ఇక ఈమె అందాల ఆరబోతతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్( NTR ) హీరోగా నటిస్తున్న దేవర( Devara ) సినిమాలో కూడా ఈమె అవకాశం అందుకున్నారు.
వీటితోపాటు మరికొన్ని వెబ్ సిరీస్ లో అలాగే సినిమాలలో కూడా నటిస్తున్నారు.తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా తాను నటిస్తున్నటువంటి ప్రెటీ గర్ల్( Pretty Girl ) అనే సిరీస్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు.
ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్ ను వదిలింది.సినిమాలో తన పాత్ర గురించి కూడా వివరించింది.తాజాగా విడుదల చేసిన పోస్టర్ ను షేర్ చేస్తూ.త్వరలోనే అత్యంత భయంకరమైన, విచిత్రమైన, కఠినతరమైన గ్లామర్ డోస్డ్ బ్లడ్ బాత్ థ్రిల్లర్ రాబోతోంది.ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.ఇంకా 3 షెడ్యూల్స్ మిగిలి ఉన్నాయి.
సిరీస్ గ్లింప్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని సరైన సమయంలో ఈ సినిమాకు సంబంధించి మరొక కీలక అప్డేట్ రాబోతుందని ప్రస్తుతం తాను ఈ షూటింగ్ పనులలోనే ఉన్నానని మరి కొద్ది రోజులు ఓపిక పట్టండి అంటూ ఈ సందర్భంగా ఈమె షేర్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.