టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood Industry ) ఏటా వందల సంఖ్యలో సినిమాలు ప్రొడ్యూస్ అవుతుంటాయి.వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్, కొన్ని సూపర్ హిట్స్, మరికొన్ని హిట్స్ గా నిలుస్తాయి, కొన్ని సినిమాలు మాత్రం ఘోరమైన పరాజయాల పాలవుతాయి.
హిట్లు, ఫ్లాపులు కామన్ కాబట్టి రిజల్ట్ గురించి పట్టించుకోకుండా దర్శక నిర్మాతలు సినిమాలు చేస్తూ పోతుంటారు.హీరోలు ఫ్యాన్స్ కు నచ్చేలా మూవీలు తీస్తుంటారు.
టాలీవుడ్ చరిత్రలో హైయ్యెస్ట్ కలెక్షన్లు( Highest Collections ) సాధించి ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచిన మూవీలెన్నో ఉన్నాయి.ఏ మూవీ గత ఇండస్ట్రీ హిట్ ను బ్రేక్ చేస్తుందో అది కొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేస్తుంది.
ఇండస్ట్రీ హిట్స్‌ను ఈ మధ్యకాలంలో చాలానే సినిమాలు బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి.
ఇండస్ట్రీ హిట్ కొట్టడం అంత ఇది పని ఏం కాదు ముఖ్యంగా ఈరోజుల్లో ఫ్లాప్ సినిమాలు కూడా 500 కోట్ల దాకా వసూలు చేస్తున్న సమయంలో! కథ బాగుండటమే కాక, డైరెక్టర్, హీరో ఇలా అన్ని కుదిరితేనే సినిమా వేల కోట్లను కలెక్ట్ చేయగలుగుతుంది.ఇప్పట్లో పాన్ ఇండియా( Pan India ) లెవెల్లో సినిమా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కోట్లు రావడం ఈసీ అయింది.కానీ అప్పట్లో బెస్ట్ స్టోరీ లతో తెరకెక్కి వందల కోట్లను సంపాదిస్తూ ఏడాది కేడాది న్యూ ఇండస్ట్రీ హిట్స్ గా కొన్ని సినిమాలు నిలిచాయి.1999 నుంచి 2016 వరకు ఇండస్ట్రీ హిట్స్‌గా సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.
1999లో సమరసింహారెడ్డి( Samarasimha Reddy ) టోటల్ గ్రాస్ కలెక్షన్ రూ.28 కోట్లు. 2000లో నువ్వే కావాలి (2000)( Nuvve Kavali ) రూ.33 కోట్లు, కలిసుందాం రా (2000)( Kalisundam Raa ) రూ.28.5 కోట్లతో ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.ఇంద్ర (2002)( Indra ) రూ.49.8 కోట్లతో ఇండస్ట్రీ హిట్ అయింది.2005లో వెంకటేష్ సంక్రాంతి సినిమా,( Sankranti Movie ) 2006లో మహేష్ బాబు పోకిరి( Pokiri ) రూ.63 కోట్లతో ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి.
2007లో యమదొంగ( Yamadonga ) మూవీ కూడా ఆ ఏడాది ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసి సూపర్ డూపర్ హిట్ అయింది.2008లో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా( Jalsa ) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.2009లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన మగధీర సినిమా( Magadheera ) రూ.120 కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది.2009లో బాలయ్య మూవీ సింహ ( Simhaa ) ఇండస్ట్రీ హిట్ అయింది.