కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలోకి అడుగుపెట్టి ఏకంగా టైటిల్ సొంతం చేసుకున్నటువంటి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి ఇలా ఒక కామన్ మ్యాన్ కప్పు గెలవడం జరిగింది.
బిగ్ బాస్ కార్యక్రమం పై ఉన్నటువంటి ఇష్టంతోనే ఈయన ఈ కార్యక్రమంలోకి రావడం కోసం ఎన్నో ఇబ్బందులను పడ్డారు.ఇక ఈ కార్యక్రమంలో అవకాశం అందుకున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున పాటిస్పేట్ చేస్తూ తన గ్రాఫ్ పెంచుకున్నారు.
ఇలా ఒక కామన్ మాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టి సెలెబ్రెటీలను కూడా వెనక్కి తోసి ఏకంగా విన్నర్ గా నిలిచారు.
ఇలా బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గతంలో పల్లవి ప్రశాంత్ గురించి తన తల్లిదండ్రులు మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.తన పేరు పల్లవి ప్రశాంత్ కావడంతో ఈయనకు పెళ్లి జరిగింది అంటూ వార్తలు వచ్చాయిల తన గురించి వస్తున్నటువంటి వార్తల పై తన తల్లిదండ్రులు స్పందించారు.
తన కొడుకుకు పెళ్లి ( Marriage ) కాలేదని తెలియజేశారు.అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే తన కొడుకుకి పెళ్లి చేస్తాము అంటూ ప్రశాంత్ తల్లిదండ్రులు తెలియజేశారు.
తన తల్లిదండ్రులు చెప్పినట్టుగానే ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు.అయితే ఇప్పటికే తనకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారని తెలుస్తుంది.బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈయనకు కెరియర్ పరంగా కూడా మంచి అవకాశాలు కూడా వస్తాయని తెలుస్తోంది.ఇలాంటి తరుణంలో పల్లవి ప్రశాంత్ తన తల్లిదండ్రులు చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుంటారా లేక కెరియర్ పై ఫోకస్ పెట్టి సినిమాలలో కొనసాగుతారా అన్న విషయం తెలియదు కానీ గతంలో తన తండ్రి చెప్పిన మాటలను ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు.