మన దేశంలోని కేరళ రాష్ట్రంలో పథనం తిట్టా జిల్లాలోని పవిత్ర క్షేత్రం శబరిమలలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో( Sabarimala Ayyappa Temple ) మండల మకరవిళక్కు పూజలు కొనసాగుతూ ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే అయ్యప్ప స్వామి దర్శనం కోసం దేశ మూలల నుంచి భక్తులు భారీగా శబరిమలకు( Sabarimala ) తరలి వస్తూ ఉన్నారు.
అయితే ఈ రోజు శబరిమల దేవాలయంలో రామ్ కుమార్( Priest Ram Kumar ) అనే పూజారి మృతి చెందాడు.దీని వల్ల అయ్యప్ప దేవాలయాన్ని 20 నిమిషాలు ఆలస్యంగా తెరిచారు.
దేవాలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం అయిన తర్వాత దేవాలయం తలుపులు తెరవడంలో ఆలస్యం అయింది.దీంతో అయ్యప్ప దర్శనం కోసం భక్తులు దేవాలయం బయట చాలా సేపు వేచి ఉన్నారు.
మరో వైపు అయ్యప్ప సన్నిదానంలో రద్దీ ఏర్పడింది.అలాగే రద్దీ నీ నియంత్రించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పతనం తిట్ట జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నత అధికారులను హైకోర్టు ఇప్పటికే ఆదేశించినట్లు సమాచారం.గత కొద్ది రోజులుగా అయ్యప్ప దర్శనం( Ayyappa Darshan ) కోసం భక్తులు పది గంటలకు పైగా వేచి ఉంటున్నారు.ఈ పరిస్థితి అదుపులో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని కేరళ హైకోర్టు ఆదేశించింది.
అలాగే దర్శనం కోసం వచ్చిన భక్తుల లో దాదాపు 20 శాతం మంది భక్తులు మహిళలు, పిల్లలే ఉన్నారని దేవస్థానం ముఖ్య అధికారులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే రెండు నెలల పాటు సాగే మండల మకరు విళక్కు సీజన్ జనవరి 20 వ తేదీ వరకు ఉంటుందనీ దేవస్థానం ముఖ్య అధికారులు చెబుతున్నారు.అయితే జనవరి 14వ తేదీన సంక్రాంతి పర్వదినం రోజున మకర జ్యోతి( Makara Jyothi ) దర్శనం తర్వాత పడిపూజతో దేవాలయాన్ని మూసి వేస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే ప్రస్తుతం కొనసాగుతున్న భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందని దేవాలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.
అలాగే భక్తులకు స్వామివారి దర్శనం త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేరళ హైకోర్టు అధికారులను ఆదేశించింది.
LATEST NEWS - TELUGU