ముఖ్యంగా చెప్పాలంటే వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల శ్రీవారి భక్తులు ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు.ఆ రోజు వైష్ణవ దేవాలయాలలో( Vaishnava temples ) ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలి వస్తారని దేవాలయ అధికారులు చెబుతున్నారు.డిసెంబర్ నెలలో 23వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం) Ekadashi festival ) వస్తూ ఉంది.
వైకుంఠ ఏకాదశి నాడు వీవీఐపీల నుంచి సామాన్యుల వరకు శ్రీవారి దర్శనం కోసం క్యూ కడతారు.

అయితే ఒక రోజులో అందరికీ దర్శనం కల్పించడం సాధ్యం అయ్యే పని కాదు.కాబట్టి ఈ నెల 25 నుంచి జనవరి ఒకటవ తేదీ వరకు పది రోజుల పాటు తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వీలు కల్పిస్తూ ఉంది.వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 300 రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లను ఈ నెల 10వ తేదీ నుంచి భక్తులకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామని తిరుమల దేవస్థానం ఈవో ధర్మ రెడ్డి ( TTD EO Dharma Reddy )వెల్లడించారు.
పది రోజులకు కలిపి రెండు లక్షల 25 వేల టోకెన్లను అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.

ఇంకా చెప్పాలంటే డిసెంబర్ 22వ తేదీన తిరుపతిలోని 9 కేంద్రాల్లో 4.25 లక్షల టైమ్స్ స్లాట్ సర్వదర్శనం టోకెన్లను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.అదే విధంగా రోజుకు రెండువేల చొప్పున శ్రీవాణి టికెట్లను కేటాయిస్తామని వెల్లడించారు.
ఈ ప్రత్యేక దర్శనంతో సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tirupati Devasthanam ) అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.ఆ పది రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలతో పాటు ఇతర దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల దేవస్థానం ముఖ్య అధికారులు వెల్లడించారు.