జగిత్యాల జిల్లా కోరుట్లలో బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి తెలంగాణలో మూడుసార్లు దీపావళి ఉందని తెలిపారు.
ఇప్పటికే ఒకసారి దీపావళి జరుపుకున్నారన్న అమిత్ షా డిసెంబర్ 3న బీజేపీ అధికారంలోకి వచ్చాక రెండో దీపావళి అని చెప్పారు.జనవరిలో అయోధ్యలో రామమందిరం ప్రారంభమైన తరువాత మూడో దీపావళి అని తెలిపారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీలను మోసం చేశాయని ఆరోపించారు.ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనన్న అమిత్ షా బీజేపీ వస్తే కుటుంబ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని తెలిపారు.