శివునికి కార్తీక మాసం( Karthika Masam ) అంటే ఎంతో ఇష్టమని దాదాపు చాలా మందికి తెలుసు.ఈ మాసంలో స్త్రీ పురుషులనే భేదం లేకుండా అందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ పరమేశ్వరుడిని( Parameshwara ) ఆరాధిస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే ఈ మాసంలో నది స్నానాలు, దీపారాధన, ఉపవాసాలు, వనభోజనాలు ఇలా చాలా ఆచారాలను పూర్వం రోజుల నుంచి పాటిస్తూ వస్తున్నారు.అయితే ఈ మాసంలో పాటించే ప్రతి ఆచారం వెనుక సైన్స్ ( Science ) దాగి ఉందని పండితులు చెబుతున్నారు.
కార్తీకమాసంలో ఆచరించే ప్రతి నియమం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని కూడా చెబుతున్నారు.మరి ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న శాస్త్రీయ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ ధర్మంలో ఏ పండుగను ఆచరించిన మొదటగా గుమ్మానికి మామిడి ఆకు తోరణాలు( Mango Leaves ) కడతారు.ఇలా మామిడి ఆకు తోరణాలు కట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు.
అయితే లక్ష్మి అంటే సంపద మాత్రమే కాదు ఆరోగ్యం కూడా అని చెబుతున్నారు.చెట్టు నుంచి తెంపిన తర్వాత కూడా మామిడాకుకు కార్బన్ డయాక్సైడ్ ను పిలుచుకునీ స్వచ్ఛమైన పీల్చుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ ను( Oxygen ) వదిలే శక్తి ఉంటుంది.కాబట్టి మామిడి ఆకులను గుమ్మానికి కడితే అవి కార్బన్ డయాక్సైడ్ ను తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ ను మనకు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ఇక ఈ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి మనలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.ఇలా వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అయితే నది నీరు( River Water ) అనేక కొండలు, కోనలు, లోయలు దాటుకుంటూ వస్తుంది.
ఇలా ప్రయాణించే సమయంలో ఆ నీటిలో అనేక ఔషధ గుణాలు కలుస్తాయి.కాబట్టి ఆ నీటిలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇలా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
దీని కారణంగా అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.కాబట్టి ఈ మాసంలో చాలామంది చల్లనీటితో స్నానానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఇక నది స్నానం తర్వాత నేతి దీపాలను( Ghee Lamp ) నదిలో వదులుతారు.ఇలా చేయడం వల్ల దీపాల వేడికి వాతావరణం లోని క్రిములు, కీటకాలు, దోమలు నశిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఉసిరి చెట్టు( Amla Tree ) కింద వనభోజనాలు చేయడం వల్ల ఉసిరి ఆకులలోని ఔషధ గుణాలను శరీరం గ్రహిస్తుంది.
DEVOTIONAL