టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మంచి ఊపు మీద ఉన్నారు.
ఈ వయసులో కూడా అదే ఎనర్జీని కొనసాగిస్తూ వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాటిలో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కూడా ఒకటి.
కాగా ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ ని పరిశీలిస్తున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది.
ఇక ఇందులో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించ నుంది.
అలాగే ఇందులో హీరో రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెరవేగంగా జరుగుతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే ఈ సినిమాలో వెంకటేష్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.విక్టరీ వెంకటేష్ ఈ సినిమాను ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో ఒక సరదా సన్నివేశంలో వెంకటేష్ నటించ బోతున్నాడట.కాగా ఇదే విషయంపై త్వరలోనే అధికారం గా ప్రకటన రానుంది.

మరి ఈ వార్తలో నిజా నిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.కాగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఈ విషయంపై స్పందించిన నెటిజన్స్ సోలో హీరోగా నటించిన చిరంజీవి.మళ్లీ విక్టరీ వెంకటేష్ ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇకపోతే చిరంజీవి విషయానికి వస్తే.
ఇటీవలే ఆచార్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి, ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.దీంతో తన తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మంచి హిట్ సాధించాలి అని చూస్తున్నారు చిరంజీవి.







