తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లలో చాలామంది మంచి డైరెక్టర్లు ఉన్నారు.ఇక అందులో మంచి డైరెక్టర్ గా పేరు పొందిన వాళ్లలో కృష్ణవంశీ( Krishna Vamsi ) ఒకరు.
ఈయన చేసిన ప్రతి సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుంది.అయితే కెరియర్ మొదట్లో మంచి సక్సెస్ లు అందుకున్న ఈయన ఆ తర్వాత మాత్రం సక్సెస్ కొట్టడం లో చాలా ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఈయన మహేష్ బాబు తో చేసిన మురారి సినిమా ( Murari movie )మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఈ సినిమా లో ఆయన చేసిన కొన్ని సీన్లు అసలు సీన్ పేపర్ లేకుండానే చేశారట నిజానికి పేపర్ మీద సీన్ కి కృష్ణ వంశీ సెట్ లో చేంజ్ చేసే సీన్స్ డిఫరెంట్ గా ఉంటాయి ఆయన ఎప్పటికప్పుడు ఒక సీన్ ని చేంజ్ చేసి రాసేస్తారు .అయితే ఈ సినిమా లో మహేష్ బాబు చనిపోతాడు అని పంతులు చెప్పినప్పుడు మొదట తను స్క్రిప్ట్ రాసుకున్నాప్పుడు హీరో చనిపోతాడు మళ్లి పుడతాడు దాంతో సినిమా ఎండ్ అవుతుంది అని రాసుకున్నారట కానీ అలా చేస్తే సినిమా పోతుంది అని కృష్ణ( Krishna ) లాంటి పెద్దవాళ్ళు చెప్పడం తో కృష్ణ వంశీ లాస్ట్ మినిట్ లో ఆయన్ని బతికెలా సీన్ రాసి ఆ సినిమాలో ఉన్న ముసలమ్మ ని చనిపోయే సీన్ క్రియేట్ చేశాడట దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.ఇక ప్రస్తుతం కృష్ణవంశీ రీసెంట్ గా రంగ మార్తాండ( Ranga Marthanda ) అనే సినిమా చేశాడు కానీ ఇది పెద్ద గా వర్కౌట్ కాలేదు దాంతో ఆయన నెక్స్ట్ ఎవరితో సినిమా చేయాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు దానితో ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఈయన ఖాళీ గా ఉన్నారు ఇప్పుడు ఈయన ఒక మంచి సినిమాతో కాంబాక్ ఇవ్వాలని చూస్తున్నారు…