ప్ర‌పంచంలోనే ఖ‌రీదైన చేప ఇది.. తినాలంటే ల‌క్ష‌లు పెట్టాల్సిందే

ఒక‌ప్పుడు తింటే గారెలే తినాలి అనే సామెత పాపుల‌ర్‌.కానీ ఇప్పుడు మాత్రం తింటే ఇలాంటి చేప‌నే తినాల‌ని అనుకుంటారేమో.

 It Is The Most Expensive Fish In The World You Have To Get Lakhs To Eat , Expens-TeluguStop.com

ఎందుకంటే ఇప్పుడు మేం చెప్ప‌బోయే చేప అంత ఫేమ‌స్ మ‌రి.దాన్ని చూసిన వారంతా కూడా తినాల‌ని అనుకుంటారు.

కానీ దాన్ని తినాలంటే చాలా అదృష్టం ఉండాలండోయ్‌.ఎందుకు ఇలా చెప్తున్నామ‌ని అనుకుంటున్నారా.

ఆగండి అక్క‌డికే వ‌స్తున్నా.దాని రేటు అలా ఉంటుంది మ‌రి.

ఏదో వంద‌, వేయి ఇలా అనుకునేరు.దాని రేటు ల‌క్ష‌ల్లో ఉంటుంది.

మీరు విన్న‌ది నిజ‌మే.ఇది ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన చేప‌గా రికార్డు క్రియేట్ చేస్తోంది.

ఈ చేప‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి.ఇది కేవ‌లం అట్లాంటిక్ మ‌హా స‌ముద్రంలో మాత్ర‌మే దొరుకుతుంది.ఇంకెక్కాడా ఇది జీవించ‌దంట‌.బ్లూఫిన్ ట్యూనా ఈపూ ఈనేవౌప జాతికి చెందిన ఈ చేప‌ల రేటు మార్కెట్లో లక్షల్లో ఉంటుంద‌ని చెబుతున్నారు.

అత్యంత టేస్టీగా ఉండే ఈ చేప ఇప్పుడు అంత‌రించిపోయే ద‌శ‌కు చేరుకుంద‌ని తెలుస్తోంది.ఈ జాతి చేప‌లు ఇప్పుడు చాలా త‌గ్గిపోయాయ‌ని చెబుతున్నారు.

విప‌రీతంగా వేటాడ‌టం వ‌ల్ల ఈ ప‌రిస్థితి త‌లెత్తుతోంద‌ని ప్ర‌పంచ నిపుణులు వెల్ల‌డిస్తున్నారు.

దీంతో ఈ జాతిని కాపాడేందుకు అక్కడి దేశాల ప్రభుత్వాలు నిషేధం విధించాయి.

నిజానికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న చేప‌ల ప్రేమికులు మొదటగా కోరుకునేది ఈజాతి చేప‌ల‌నే అని చెబుతున్నారు నిపుణులు.అయితే వీటిని అతిగా తినేయ‌డంతో అంత‌రించిపోయే ద‌శ‌కు చేరుకున్నాయి.

ఇక వీటిని త‌మ మెనూలో చేర్చేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమ‌స్ రెస్టారెంట్లు తెగ పోటీ ప‌డుతున్నాయి.కానీ వాటికి ప్ర‌భుత్వాలు షాక్ ఇచ్చేశాయి.

అయితే ఈ నిషేధం తాత్కాలిక‌మా లేదంటే సుదీర్ఘ కాల‌మా అన్న‌ది మాత్రం తెలియ‌దు.ఈ వార్త నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube