ఇక్కడ బేసిగ్గా అబ్బాయిలు హీరోల పాటలకు మాత్రమే డాన్సులు చేస్తారు.అలాగే హీరోయిన్ల పాటలకు అమ్మాయిలు మాత్రమే డాన్సులు చేస్తూ వుంటారు.
ఒకవేళ హీరోయిన్ల పాటలకు ఓ మగాడు డాన్స్ చేస్తే ఈ సమాజం వారిని వేరేలా చూస్తుంది.అలాగే అబ్బాయిల పాటలకు అమ్మాయి డాన్సులు చేసినా కూడా వారిని అలాగే ట్రీట్ చేస్తుంది ఈ సమాజం.
అయితే ఇక్కడ పదహారణాల అబ్బాయి హీరోయిన్ ఐశ్వర్య రాయ్ పాటలకు డాన్సులు దుమ్ము లేపుతున్నాడు.ఎవరు ఏమనుకున్నా ఆ అబ్బాయి అనుకున్న పని చేస్తున్నాడు.
అచ్చం హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా అతగాడు వేసిన డాన్సులు న భూతో న భవిష్యతి అన్న మాదిరి వున్నాయి.
డాన్సులు మాత్రమే కాదు అతడి కట్టు బొట్టు అమ్మాయిలాగే ఉండడం విశేషం.
ఈ భారతీయ కుర్రాడు అమెరికా వీధుల్లో అమ్మాయిలా డ్రెస్సింగ్ వేసి అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నాడు.పేంటు మీదే స్కర్ట్ ధరించి స్టెప్పులతో అదరగొడుతున్నాడు.అయితే గతంలో ఇతనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా తాజాగా ఐశ్వర్య రాయ్ ఫేమస్ సాంగ్ బర్సో రే మేఘా.మేఘా పాటకు స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు.
అతడి హావాభావాలు సైతం అమ్మాయిల మాదిరిగానే ఉండటం గమనార్హం.
ఇకపోతే సోషల్ మీడియాలో అతగాడి డాన్సులు చూసి అమ్మాయిలు సైతం అవాక్కవుతున్నారు.
అతగాడి హావభావాలు చూసి అతివలు కుళ్లిపోతున్నారు.డ్యాన్స్ వీడియోస్ చూసిన నెటిజన్స్ అద్భుతంగా, సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అతడి వీడియోలకు లక్షల్లో వ్యూస్ రావడం కొసమెరుపు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.
అమ్మాయిలు ‘నిన్ను చూస్తుంటే అసూయ కలుగుతుంది మిస్టర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఒకసారి మీరు కూడా అతగాడి నృత్యాన్ని చూసి అభిప్రాయాన్ని తెలిజేయజేయండి.








