కరోనా వ్యాక్సిన్ పై బిల్‌గేట్స్ షాకింగ్ కామెంట్స్.. లక్షల మంది మరణిస్తారని జోస్యం.. !?- Bill Gates Shocking Comments On The Corona Vaccine

Bill Gates, corona vaccine, fake news, social media - Telugu

కోవిడ్ మహమ్మరిని నిర్మూలించడానికి వందల మంది శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించి ఎట్టకేలకు వ్యాక్సిన్ కనుగొన్నారు.అయితే ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు అస్వస్దతకు గురై మరణిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే.

 Bill Gates Shocking Comments On The Corona Vaccine-TeluguStop.com

దీంతో ఈ వ్యాక్సిన్ వేసుకోవాలంటే వణికిపోతున్న వారు కూడా ఉన్నారు.

ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ వ్యాక్సిన్‌ వల్ల ఏడు లక్షల మంది చావడమో లేదా వికలాంగులుగా మారడమో జరుగుతుందని అన్నాడనే వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

అంతేకాదు, కొందరైతే టీకా వేయించుకోవద్దని సూచిస్తూ స్నేహితులకు, సన్నిహితులకు మెసేజ్ పాస్ చేస్తున్నారట.అయితే ఇదంతా దుష్ప్రచారమని, వ్యాక్సిన్‌ తీసుకుంటే చనిపోతారని బిల్‌గేట్స్‌ ఎక్కడా చెప్పలేదంటున్నారు అధికారులు.

ఇంతకు ఆయన చెప్పిన విషయం ఏంటంటే గతేడాది ఏప్రిల్‌లో సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీకా తీసుకోవడం వల్ల సుమారు ఏడు లక్షల మందికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందని మాత్రమే అన్నారట.కాబట్టి ఇది ఫేక్‌ న్యూస్ తప్ప నిజమైన న్యూస్ కాదంటున్నారు.

ఇక మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాక్సిన్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయని కానీ అవి కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది.ఇక పక్కా క్లారీటీ ఏంటంటే కరోనా వ్యాక్సిన్‌ వల్ల ఏడు లక్షల మంది మరణిస్తారని బిల్‌గేట్స్‌ చెప్పలేదు.

#Social Media #Bill Gates #Corona Vaccine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు