ముఖ్యంగా చెప్పాలంటే పవిత్రమైన కార్తీక మాసంలో( karthika masam ) శివ కేశవుల ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.అలాగే కార్తీక మాసంలో దీపారాధన చేయడం దాన ధర్మాలు చేయడం ఆచారంగా వస్తూ ఉంది.
ఇంకా చెప్పాలంటే కార్తీక మాసం అంటే దేవాలయ దర్శనాలు, పూజలు,వ్రతాలు మాత్రమే కాకుండా వనభోజనాలు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో కార్తీక వనభోజనాలు( Kartika Vanabhojanas ) సంప్రదాయం ప్రకారం కొనసాగుతున్నట్లే చాలా దేశాలలో వనభోజనాలు చేసే సంప్రదాయాలు ఉన్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం మనకు చాలా కాలం కొనసాగుతున్న ఆచారం అని పెద్ద వారు చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే శివ కేశవులకు( shiva keshavulu ) పవిత్రమైన ఈ మాసంలో ఉసిరి చెట్టు నీడలో వనభోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది.అలాగే యోగాలు, హోమాలు, పూజలు, వ్రతాలు, తర్పణాలు చేసేటప్పుడు జరిగిన లోపాల వల్ల సంభవించిన దోషాలను తొలగించుకోవడానికి తప్పని సరిగా కార్తిక మాసంలో వనభోజనాలు చేసి తీరాలని స్కంద పురాణంలో ఉంది.ఈ పురాణం ప్రకారం కార్తీక వనభోజనాల కోసం ఎంపిక చేసుకునే వనంలో నానా జాతుల వృక్షాలు ఎక్కువగా ఉండాలి.
వాటిలో ముఖ్యంగా ఉసిరి చెట్టు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఉసిరి చెట్టు ( amla tree )క్రింద సాలగ్రామాన్ని ఉంచి శాస్త్రోక్తంగా పూజించి పురోహితులకు యథాశక్తి దక్షిణ తాంబూలాలను తాంబూలాలను సమర్పించుకోవాలి.వనభోజనంలో వంటలు చేసుకుని పురోహితులతోనూ, బంధుమిత్రులతో కలిసి భోజనాలు చేయాలి.కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడలో సాలగ్రామాన్ని పూజించి, పురోహితులకు అన్న సంతార్పణ చేసి, వన భోజనాలు చేసి, కార్తిక మహాత్మ్యాన్ని విన్న వారికి సమస్త పాపాలు తొలగిపోయి, మరణం తర్వాత విష్ణు లోక ప్రాప్తి కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది.
DEVOTIONAL