మన దేశంలో ఉన్న చాలా మంది ప్రజలు ఎన్నో ఆచార సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తూ ఉంటారు.సనాతన ధర్మం ప్రకారం మనం ఆచరించే నియమాలు విశ్వసించే నమ్మకాల వెనుక సైన్స్ ఉంటుందని నమ్మేవారు కూడా ఉన్నారు.
అందుకే చాలామంది ఆచార సంప్రదాయాలను( Ritual traditions ) పాటిస్తూ ఉంటారు.కానీ కొందరు ఈ టెక్నాలజీ( Technology ) కాలంలో ఆచారాలు ఏంటి అని చెప్పేవారు కూడా ఉన్నారు.
కానీ చదువుకున్న అనేకమంది కూడా ఇప్పటికీ ఆచారాలను విశ్వసిస్తున్నారు.ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు.
నల్లపిల్లి ఎదురైతే కీడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం ఆపశకునం ఇలా ఎన్నో నమ్మకాల గురించి పెద్దవారు చెబుతూ ఉంటారు.
వీటిని కొందరు మూఢనమ్మకాలని అంటూ ఉన్నారు.మరి కొందరు ఇప్పటికీ ఈ నమ్మకాలను పాటిస్తున్నారు.అయితే వీటి వెనక ఎంతో సైన్స్ ఉందని చాలామంది చెబుతున్నారు.
ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు భార్యకు మల్లెపూలు( jasmine flowers ) తీసుకెళ్లడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దవారు.
నిజమే ఇంట్లో ఆడ వారు ఉంటే ఆ కలే వేరు.అలాంటి ఆడవారు ఎప్పుడు సంతోషంగా ఉంటే ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది.
ఆనందంగా సంసారాన్ని సాగిస్తే ఆ ఇంట్లో వారి జీవితం అంత ఆనందంగా ఉంటుంది.మనిషిని వేధించే సమస్యలలో ముఖ్యమైనవి ఆర్థిక సమస్యలు.
అలాంటి సమస్యలు దూరం ( Problems away )కావాలంటే ముందు మీ ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచాలి.మగవారు భార్యకు రోజు మూర మల్లె పుల కొని తీసుకెళ్తే మంచిది.మీ ఉద్యోగంలో, వ్యాపారంలో తగినంత సంపాదన లేకపోతే ప్రతిరోజు భార్య తలలో మల్లె పూలు సింగారించుకొంటే శుక్రుడు అనుగ్రహిస్తాడు.శుక్రుడు అనుగ్రహిస్తే ఉద్యోగ వ్యాపారాలు కలిసి వచ్చి సంపద పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.
కాబట్టి ఈ చిన్న చిట్కాను పాటిస్తే శుక్రుని అనుగ్రహం పొంది వ్యాపార ఉద్యోగ రంగాలలో లాభాలను పొందవచ్చు.అలాగే ఆర్థిక సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.
DEVOTIONAL