స్వాతంత్రం అనంతరం క్రీడలలో భారత్ సాధించిన అద్భుత విజయాలు ఇవే..!

భారతదేశానికి ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం( Independance Day ) వచ్చిన అనంతరం టెక్నాలజీ, విద్య, వైద్యం, క్రీడ రంగాలలో భారతదేశము కేవలం కొద్ది కాలంలోనే ఎంతో అభివృద్ధి సాధించి ముందుకు దూసుకు వెళ్ళింది.స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచాయి.

 These Are The Amazing Achievements Of India In Sports After Independence Details-TeluguStop.com

ఈ ఏడు దశాబ్దాలలో భారత్( India ) ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

భారతదేశం స్వాతంత్రం అనంతరం క్రీడలలో( Sports ) సాధించిన చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన విజయాలు ఇవే.

1948లో లండన్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో( London Olympics ) భారత హాకీ జట్టు తొలిసారిగా స్వర్ణ పతాకాన్ని సాధించింది.స్వాతంత్రం తరువాత భారత్ గెలిచిన తొలి స్వర్ణం ఇదే.

Telugu Cricket Cup, India, August, Commonwealth, London Olym, Milkha Singh-Sport

ఫుట్ బాల్( Football ) ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అనుసరించే క్రీడ.కానీ భారతదేశంలో ఆ స్థాయి గుర్తింపు ఇంకా పొందాల్సి ఉంది.అయితే భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ తో సహా కొన్ని ప్రాంతాలలో ఫుట్ బాల్ అతి పెద్ద క్రీడా.1951, 1960లో జరిగిన ఆసియా క్రీడల్లో భారతదేశం రెండు సార్లు స్వర్ణాలను సాధించింది.

1952లో హెల్సింకి ఒలంపిక్స్ లో బాంటమ్ వెయిట్ విభాగంలో KD జాదవ్ కాంస్య పతకాన్ని సాధించాడు.కుస్తీల్లో మొదటి ఒలంపిక్ పతకాన్ని అందించిన మొదటి భారతీయ అథ్లెట్ అయ్యాడు.

Telugu Cricket Cup, India, August, Commonwealth, London Olym, Milkha Singh-Sport

1958 లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 440 గజాల విభాగంలో మొదటి స్వర్ణం సాధించి, అత్యుత్తమ అథ్లెట్లలో మిల్కా సింగ్( Milkha Singh ) సూపర్ స్టార్ అయ్యాడు.

1960,1961లో వింబుల్డన్ లో రామనాథన్ కృష్ణన్ సెమీఫైనల్ వరకు వెళ్లాడు.భారతదేశంలో ఇప్పటికీ చాలామంది టెన్నిస్ ఆడరు.

భారతదేశంలోని చాలామందికి టెన్నిస్ ఆటను తెలియజేసింది రామనాథన్ కృష్ణనే.

Telugu Cricket Cup, India, August, Commonwealth, London Olym, Milkha Singh-Sport

1980లో ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాట్మింటన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న మొదటి భారతీయుడుగా ప్రకాష్ పదుకొనె( Prakash Padukone ) ప్రత్యేక గుర్తింపు పొందాడు.బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తండ్రి ఈ ప్రకాష్ పదుకొనె.

1983లో క్రికెట్ లో భారత్ ప్రపంచ కప్ గెలిచింది.తర్వాత మళ్లీ 2011లో భారత్ ప్రపంచ కప్ తో పాటు టీ20 ప్రపంచ కప్ గెలిచింది.

Telugu Cricket Cup, India, August, Commonwealth, London Olym, Milkha Singh-Sport

2000 లో విశ్వనాథన్ ఆనంద్( Viswanathan Anand ) ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిన మొదటి భారతీయుడు.ఇతను ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచాడు.

విజేందర్ సింగ్ భారతదేశానికి పతకం సాధించిన మొదటి బాక్సర్ అయితే, 2008లో ఒలంపిక్స్ లో స్వర్ణం గెలిచిన మొట్టమొదటి భారతీయుడు అభినవ్ బింద్రా.

చాలా విరామం తర్వాత నీరజ్ చోప్రా భారతదేశానికి మరో స్వర్ణం సాధించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube