గుడ్ నైట్ మూవీ ఏంటి ఇలా ఉంది...

కొన్ని సినిమాలు డిఫరెంట్ కన్స్పట్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకుంటాయి అలాంటి సినిమానే కోలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన గుడ్ నైట్ సినిమా (Good night movie )…ఒక మూవీ హిట్ కావడానికి భారీ సెట్టింగ్స్, హంగు, ఆర్భాటాలు ఉండాల్సిన అవసరం లేదని, ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేసే స్టోరీ, కథనం ఉంటే సరిపోతుందని ఈ మూవీ మరోసారి నిరూపించింది…చిత్రం భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.ఈ మూవీ ‘గురక’ అనే పాయింట్ తో తెరకెక్కింది.

 Good Night Movie Review , Good Night Movie , Review , Tollywood , Ott , K. Manik-TeluguStop.com

తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది.ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

Telugu Manikandan, Kollywood, Review, Tollywood-Movie

మణికందన్, మీరా రఘునాథ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘గుడ్ నైట్’ సినిమా ఈ ఏడాది మే 23న తమిళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్రానికి వినాయక్ చంద్రశేఖరన్( Vinayak Chandrasekaran ) ద్రశకత్వం వహించారు.ఇక కథ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ జాబ్ చేసే మోహన్ కు ఒక సమస్య ఉంటుంది.అతను నిద్రపోయాడంటే గురక రీసౌండ్ వస్తుంది.ఆ గురకకి పక్కింటివాళ్లు సైతం భయపడిపోవాలి.తన గురక వల్ల అందరూ తిడుతుంటారు…

 Good Night Movie Review , Good Night Movie , Review , Tollywood , Ott , K. Manik-TeluguStop.com
Telugu Manikandan, Kollywood, Review, Tollywood-Movie

ఒక రోజు ఊహించని పరిస్థితుల్లో అను పరిచయమవుతుంది.అందరితో అంతగా కలవని అను, మోహన్ ను ప్రేమిస్తుంది.కొద్ది రోజులకే వారి పెళ్లి జరుగుతుంది.మొదటిరాత్రి రోజు మోహన్ కు గురక సమస్య ఉందని అనుకు తెలుస్తుంది.ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు భార్యభర్తలు కలిశారా? లేదా అనేదే మిగతా కథ…

Telugu Manikandan, Kollywood, Review, Tollywood-Movie

హీరోకు సమస్య ఉన్న కథతో టాలీవుడ్ లోనూ( Tollywood ) సినిమాలు వచ్చాయి.మహానుభావుడు, భలే భలే మాగాడివోయ్ వంటివి.ఆ కోవలో వచ్చిందే గుడ్ నైట్ మూవీ.

హీరోకు ఉన్న గురక సమస్యతో ఇంట్లోవారు, పక్కింటివారు ఇలా అందరూ ఇబ్బందులు పడుతుంటారు.గురక సమస్యను హీరోకు పెట్టి, దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ విజయం సాధించాడు.

సినిమా మొదలవగానే హీరోకు గురక ఉందని అర్థమవుతుంది.గురకతో హీరో చుట్టు పక్కల వాళ్ళు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా చూపించాడు.

ఇక వాళ్లు అనే మాటలు నవ్విస్తాయి…ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు వీలైతే మీరు కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube