కాటుక, కాజల్,సర్మ ఇవన్నీ కూడా కళ్ళకు పెట్టే సౌందర్య ఉత్పత్తులే అని కచ్చితంగా చెప్పవచ్చు.సాంప్రదాయ భారతీయ సంస్కృతిలో ఇది చాలా ముఖ్యమైనది.
చెడు దృష్టి నుంచి చిన్నపిల్లలను కాపాడుకోవడం కోసం ఇలా కాటుకను పెడుతూ ఉంటారు.మరికొందరు చిన్న పిల్లల కళ్లు పెద్దవిగా, అందంగా కనిపించాలని కాటుకను ( kajal )ఉపయోగిస్తూ ఉంటారు.
కుటుంబంలోని పెద్దలు నెలల వయసున్న చిన్న పిల్లలకు కూడా కాటుకను పెట్టాలని చెబుతూ ఉంటారు.దీన్ని శిశువుల కంటి దిగువ భాగంలో పెడతారు.
అలాగే చెవి వెనుక దిష్టి తగలకుండా పెట్టేవారు కూడా ఉన్నారు.
చంపల మీద నుదుటి పైన కూడా ఎంతోమంది ఈ కాటుకను పెడుతూ ఉంటారు.అయితే ఇలా నవజాత శిశువుకు( newborn baby ) కాటుకను పెట్టడం సురక్షితమైన కాదా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.కాటుక ఉపయోగించడం వల్ల పసిపిల్లలకు మేలు జరుగుతుందని చాలామంది పెద్దవారు నమ్ముతారు.
కానీ వైద్యులు మాత్రం ఆ విషయంతో ఏకీభవించడం లేదు.ఎందుకంటే కాటుక తయారీలో సీసం ఉండే అవకాశం ఉంది.
దీని వల్ల పిల్లల కళ్ళలో దురద, చికాకు( Itching, irritation ) వంటివి వస్తాయి.అలాగే దుకాణాలలో కొనుగోలు చేసే కాటుకలో చాలావరకు సిసం తో తయారు చేస్తారు.
ఇవి పిల్లలకు పెట్టడం అసలు మంచిది కాదు.ఇంట్లో తయారు చేసే కాటుకను వాడేవారు కూడా ఉన్నారు.
కాటుక ఎలా తయారు చేసినా అందులో కార్బన్( Carbon ) ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.బయట దొరికే కాటుకలు అధికంగా బొగ్గుతో తయారుచేసినవే ఉంటాయి.
బొగ్గు, కొబ్బరి నూనె ఉపయోగించి వాటిని తయారు చేస్తూ ఉంటారు.అలాంటి కాటుకను పిల్లలకు పెట్టడం అసలు మంచిది కాదు.
అలాగే చేతులు శుభ్రంగా లేకుండా చిన్నపిల్లల కళ్లకు కాటుక పెట్టడం వల్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా, వైరస్( Bacteria , virus ) లు కళ్ళల్లో చేరే అవకాశం ఉంది.కాబట్టి కళ్ళకు కాటుక పెట్టకపోవడమే మంచిది.దిష్టి తగలకుండా పిల్లలకు కాటుక పెట్టవాలనుకుంటే చెవుల వెనుక,చెంప్పల మీద పెట్టడం మంచిది.శిశువుకు స్నానం చేసేటప్పుడు ఆ కాటుకను తడి గుడ్డతో మృదువుగా తుడవాలి.లేదంటే అది చర్మపు కణాల్లో ఇంకిపోయే అవకాశం ఉంది.
LATEST NEWS - TELUGU