ఏపీలో చాలా నియోజకవర్గాలలో వైసీపీ పార్టీకి చెందిన నేతల మధ్య నువ్వా నేనా అనే వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చాలా పంచాయతీలు సీఎం జగన్( CM YS Jagan ) దృష్టిదాక కూడా వెళ్లాయి.
ఈ రకంగానే ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వర్సెస్ మంత్రి జోగి రమేష్ మధ్య వాతావరణం ఉందన్న సంగతి తెలిసిందే.మంత్రి జోగి రమేష్( Minister Jogi Ramesh ) తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని.
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చాలా సందర్భాలలో వ్యాఖ్యానించడం జరిగింది.దీంతో మైలవరం వైసీపీలో గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయి.
ఈ వివాదంపై అప్పట్లో సీఎం జగన్ జోక్యం చేసుకోవడంతో చాలా వరకు సద్దుమణిగింది.
అయితే మరోసారి ఇప్పుడు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్( MLA Vasantha Krishna Prasad ) కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్ నియామక మహోత్సవంలో పాల్గొన్న ఆయన అసమ్మతి నేతలపై మండిపడ్డారు.“నేను ఎంత సౌమ్యంగా ఉంటాను అనేది ఒకపక్క విషయం.రెండో పక్క కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించారు.ఇదే సమయంలో భయపెట్టి లొంగదీయలనీ చూస్తే అది ఈ జన్మకు అసాధ్యం అనీ వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో మరోసారి మైలవరం నియోజకవర్గం గ్రూపు రాజకీయాలు వైసీపీలో చర్చనీయాంసంగా మారాయి.