ఏ ఉద్యోగికి కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి కాదు.. టెక్సాస్ గవర్నర్ సంచలన నిర్ణయం

అమెరికాను కరోనా నుంచి రక్షించడానికి అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమన్న ఆయన.

 Texas Governor Bans Covid-19 Vaccine Mandates By Any Employer In State , Texas G-TeluguStop.com

ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని కోరుతున్నారు.అయినప్పటికీ జనం వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్న సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో వ్యాక్సిన్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతుండటం వల్లే ఈ పరిస్ధితి ఎదురవుతోంది.ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాలపపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశాన్ని కరోనా ఫ్రీ చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్న ఆయన ప్రయత్నాలకు సోషల్ మీడియా తీవ్ర అవరోధంగా మారింది.సామాజిక మాధ్యమాలు అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించి దుమారం రేపారు.

ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.దేశంలోని 50 రాష్ట్రాల్లో కొన్ని బైడెన్‌కు మద్ధతుగా వ్యాక్సినేషన్‌ను తప్పనిసరి చేస్తే.

ఇంకొన్ని చోట్ల మాత్రం ప్రజల అభిష్టానికే వదిలేశారు.ప్రధానంగా రిపబ్లికన్లు అధికారంలో వున్న చోట ఈ సమస్య ఎదురవుతోంది.

ఇటీవల మహిళల అబార్షన్‌లపై నిషేధం విధించేందుకు చట్టం చేసి సంచలనం సృష్టించి టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రైవేట్ యజమానులతో సహా అన్ని రాష్ట్ర సంస్థలు తప్పనిసరి టీకా అమలు చేయకుండా నిషేధించారు.

వ్యక్తిగత కారణాలు, మతం, వైద్య కారణాల వల్ల ప్రజలు వ్యాక్సిన్ వద్దు అంటే టీకాలు వేయరాదని అబోట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌లో పేర్కొన్నారు.వ్యాక్సిన్ సురక్షితమైనదేనని, వైరస్‌పై పోరాటంలో వ్యాక్సిన్ ఒక్కటే ఉత్తమ రక్షణ అని ఆయన చెప్పారు.

అయితే అది స్వచ్ఛందంగా వుండాలని.బలవంతం చేయకూడదని గవర్నర్ తెలిపారు.

దీనికి అనుగుణంగా రాష్ట్ర శాసనసభలో కూడా చట్టాన్ని ఆమోదించాలని అబోట్ పిలుపునిచ్చారు.ఆ చట్టం ఆమోదించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను రద్దు చేస్తామని గవర్నర్ కార్యాలయం తెలిపింది.

కాగా, కొద్దిరోజుల క్రితం బైడెన్ పెద్ద ఎత్తున మాస్క్‌ల పంపిణీ కార్యక్రమం చేపట్టిన సమయంలో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్‌ అబోట్ సంచలన నిర్ణయం తీసుకుని అప్పట్లో దుమారం రేపారు.రాష్ట్ర ప్రజలు ఇకపై మాస్క్‌లు ధరించడం తప్పనిసరి కాదన్నారు.

అలాగే నూరు శాతం వ్యాపార కార్యకలాపాలకు కూడా ఆయన అనుమతించారు.ఈ నిర్ణయం ద్వారా మాస్క్‌ ధరించడం తప్పనిసరి నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేసిన తొలి రాష్ట్రంగా టెక్సాస్ నిలిచింది.

కరోనా కారణంగా టెక్సాస్‌ పౌరులు ఉపాధి అవకాశాలు కోల్పోయారని గవర్నర్‌ అబోట్ ఆవేదన వ్యక్తం ఈ పరిస్థితికి ముగింపు పలికేలా నూరు శాతం వాణిజ్య కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు అబోట్ పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube