టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ పార్టీ పై తీవ్రస్థాయిలో సీరియస్ కామెంట్లు చేశారు.రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఇక ఇదే సమయంలో గడపగడపకు వైసీపీ అని పేరు పెడితే ప్రజలు వెంటబడి కోడతారేమో అనిగడపగడపకు మన ప్రభుత్వంఅనే టైటిల్ పెట్టారని చెప్పారు.ముఖ్యంగా టీడీపీ నిరసన కార్యక్రమం “బాదుడే బాదుడు” కార్యక్రమానికి పోటీగా వైసీపీ రాష్ట్రంలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు మండిపడ్డారు.
ఇక ఇదే సమయంలో తాడికొండలో ప్రభుత్వ పనితీరు ప్రశ్నించిన వెంకాయమ్మ అనే మహిళపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు సీరియస్ ఆరోపణలు చేశారు.రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గాని తెలుగుదేశం పార్టీ 160 స్థానాల్లో గెలవటం గ్యారెంటీ అని చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నట్లు జోస్యం చెప్పారు.
వైసీపీ గాలి పార్టీ.గాలికి వచ్చిన పార్టీ గాలికే పోతుందని వ్యాఖ్యానించారు.రాజకీయ పార్టీ అని చెప్పుకోవడానికి వైసీపీకి అర్హత లేదని తెలిపారు.టీడీపీ నుండి వచ్చిన ఇద్దరికీ.
జగన్ దొంగ లెక్కలు రాసి ఒకరికి సీబీఐ కేసులు వాదించే మరొకరికి రాజ్యసభ సీట్లు ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు.బీసీలను పక్కన పెట్టిందని.
రెడ్లకు వైసీపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు.