ఈ నెల 27 28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు ను ఘనంగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది.2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచేందుకు దీనిని వేదికగా చేసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మహానాడుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మహానాడు మీటింగ్ కు అవసరమైన వేదిక నిర్వహిస్తున్న ప్రాంతంలో ఈరోజు ఆ పార్టీ నాయకులు భూమి పూజ నిర్వహించారు.మహానాడు ను సమర్ధవంతంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే అజెండాలు తీర్మానాల పై కసరత్తును ఫైనల్ చేశారు.భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనుసరించిన రాజకీయ వ్యూహాలు, ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, 2024 ఎన్నికల్లో టిడిపి గెలవాలి అంటే ఏం చేయాలి ? ఇలా అనేక అంశాలపై చర్చించనున్నారు.ఇక ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ నాయకులు హాజరు కాబోతూ ఉండడంతో వారికి నోరూరించే వంటకాలను తెలుగుదేశం పార్టీ సిద్ధం చేస్తోంది.ఈ వంటకాల్లోనూ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా రకరకాల వంటకాలను చేర్చారు.
ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం విందుభోజనం, రాత్రి విందు భోజనం, పచ్చళ్ళు, కూల్ డ్రింక్స్, స్నాక్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తో పాటు ఎన్నో నాన్వెజ్ వంటకాలను ఇందులో ఏర్పాటు చేశారు.దీనికి సంబంధించి మెనూ కార్డును కూడా టిడిపి విడుదల చేసింది.

మధ్యాహ్నపు విందు భోజనం
మిక్స్డ్ వెజిటబుల్ బూర్జి, కరివేపాకు కోడి వేపుడు,ఆంధ్ర వెజిటబుల్ ఖీమా పులావ్, విజయవాడ కోడి బిర్యానీ, నాటు కోడి పులుసు, హైదరాబాద్ మటన్ దమ్ బిర్యాని, భీమవరం రొయ్యల కూర, చపాతి, పన్నీర్ బట్టర్ మసాలా, బాపట్ల సోనామసూరి అన్నం, ఆదోని ముద్దపప్పు, మంగళగిరి సొరకాయ పులుసు, గుంటూరు పెరుగు చారు, బెండకాయ పకోడీ, గుంటూరు పప్పు చారు, పూత వడియాలు, పెరుగు అన్నం, ఊర మిరపకాయలు, హైదరాబాద్ తీపి కిళ్ళీ.
పచ్చళ్ళు
కొత్త ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మ కాయ పచ్చడి, గోదావరి రొయ్యల పచ్చడి, విజయవాడ మటన్ పచ్చడి, గుంటూరు కోడి పచ్చడి,
మధ్యాహ్నపు అల్పాహారం
ఉల్లి సమోసా, కార భూంది, మసాలా టి, సాల్ట్ బిస్కెట్స్, జీరా బిస్కెట్స్ .
శీతల పానీయాలు
మాంగో ఫెలుదా, రోజ్ ఫెలుధా, డ్రై ఫ్రూట్ ఫెలుదా, చెరుకు రసం, మాంగో లస్సి , సపోటా లస్సీ.
ఐస్ క్రీమ్స్
సపోటా ఐస్ క్రీమ్, మలై కుల్ఫి, వెనిల్లా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్.







