బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు లాకప్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ కార్యక్రమం గత కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యింది.ఈ లాక్‌ప్ షో విన్నర్‌గా నటుడు మునావర్ ఫరూఖీ నిలవగా.
రన్నర్ గా నటి పాయల్ రోహత్గీ నిలిచారు.మొదటినుంచి లాకప్ షో విన్నర్పాయల్ రోహత్గీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఆమె కూడా తానే విన్నర్ అంటూ గట్టి నమ్మకంతో ఉన్నారు.
కానీ ఈ షో విన్నర్ గా నటుడు మునావర్ ఫరూఖీను ప్రకటించడంతో నటి పాయల్ కాస్త అసహనం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన ఆమె తీవ్ర స్థాయిలో హోస్ట్
కంగనా
పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ షోలో భాగంగా ‘పాయల్ ఈ ఎపిక్ టెస్ట్ పాసవుతుందా?’ అనే గతంలోని పోస్ట్‌ను రీ పోస్ట్ చేస్తూ అసహనం వ్యక్తం చేశారు.కంగనా ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లారు.ఆ సమయంలోనే ఈ షో విన్నర్ ఎవరో నిర్ణయించి ఉంటారని ఈమె కంగనాను తప్పు పట్టారు.

లోకల్ షో లో బాగా నిజాయితీగా ఆడిన వారు బహుశా గెలవరేమో.కాలుపై కాలు వేసుకుని కూర్చున్న వారే విన్నర్ అవుతారనుకుంటా అంటూ ఈ షో విన్నర్ పై కామెంట్ చేశారు.ఇక ఈ కార్యక్రమంలో తాను రన్నర్ గా నిలబడటాన్ని జీర్ణించుకోలేకపోయిన పాయల్ కంగనా రనౌత్ ను అన్ ఫాలో చేయటమే కాకుండా, కంగనా నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ కావాలని కోరుకుంటున్నా అంటూ తన సినిమాల గురించి శాపనార్థాలు పెట్టారు.ఈ విధంగా నటి పాయల్ రోహత్గీ కంగనా సినిమాల గురించి చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.








