తెలంగాణ ఎన్నికల్లో నాయకుల మధ్య పోరు మరీ ముదిరిపోయింది.కీలక నాయకులుగా ఉన్న తెలంగాణ ముఖ్య నాయకులంతా … ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ… రాజకీయాలకు కొత్త అర్ధం చెబుతున్నారు.తాజాగా… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు… కొడంగల్ ఎమ్యెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డికి ఎలక్షన్ కమీషన్ షాకిచ్చింది.రేపు కొడంగల్ నియోజక వర్గం లో కేసీఆర్ నిర్వహించే ‘ ప్రజా ఆశీర్వాద సభ’ను అడ్డుకుంటామని పోలీసుల ముందే రేవంత్ రెడ్డి హెచ్చరించడంపై .టీఆర్ఎస్ పార్టీ నాయకులూ తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

దీనికి సంబంధించిన వీడియో ను సాక్ష్యంగా సమర్పించింది .వాటిని పరిశీలించిన ఎన్నికల కమిషన్ అధికారులు రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ని ఆదేశించినట్లు సమాచారం.దీనితో కొడంగల్ పోలీస్ స్టేషన్ లో {241,188, 506,511} సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.