రాధే శ్యామ్‌ మొదటి పాట వచ్చేది ఎప్పుడంటే..!

యూనివర్శిల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది.త్వరలోనే పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ ను కూడా ముగించబోతున్నారు.

 Prabhas Radeshyam Movie First Song ,prabhas, Radheshyam Movie, Radheshyam Movie-TeluguStop.com

పెద్ద ఎత్తున అంచనాలున్న ప్రభాస్‌ సినిమా నుండి పాటలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా కోసం ఇద్దరు సంగీత దర్శకులు వర్క్‌ చేశారు.

సౌత్‌ భాషల్లో పాటల కోసం ఒక సంగీత దర్శకుడు కాగా.హిందీ ప్రేక్షకుల కోసం ఒక సంగీత దర్శకుడు పని చేశాడు.

పాటల ప్లేస్‌ మెంట్‌ విషయంలో తేడా ఏమీ లేదు.అలాగే చిత్రీకరణ విషయంలో కూడా తేడా ఏమీ లేదు.

అయినా కూడా రాధే శ్యామ్‌ రెండు విభిన్నమైన భాషల పాటలను వినాలంటూ అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు.

Telugu Pooja Hegde, Prabhas, Prabhas Stylish, Radeshyam, Radhakrishna, Radheshya

రాధాకృష్ణ చాలా స్టైలిష్‌ లుక్‌ తో ప్రభాస్ ను చూపించాడు. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌ ఖర్చు చేసి నిర్మించారు.ఈ సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా ఎప్పుడు ఎప్పుడు అన్నట్లుగానే అభిమానులు ఎదురు చూశారు.

ఎట్టకేలకు స్టైలిష్‌ లుక్‌ తో ప్రభాస్ లుక్‌ వచ్చింది.అలాగే సినిమా విడుదల తేదీని కూడా మరోసారి ప్రకటించారు.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిన సమయంలోనే విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వాలనుకున్నారు.

అయితే ఇప్పటి వరకు రాధే శ్యామ్‌ సినిమా ఆడియో విడుదల తేదీ క్లారిటీ లేదు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా నుండి మొదటి పాటను సెప్టెంబర్‌ లో విడుద లచేయాలని భావిస్తున్నారట.

విడుదల తేదీ దగ్గరకు వస్తున్న కారణంగా చక చక ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు.ప్రభాస్ కు జోడీగా ఈ సినిమా లో పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే.

ఇక కీలక పాత్రలో కృష్ణం రాజు కనిపించబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube