Tarakaratna Alekhya : తారకరత్నను తలచుకుంటూ ఎమోషనల్ అయిన అలేఖ్య.. భర్త మరణించి ఏడాది కావడంతో?

నందమూరి దివంగత హీరో తారకరత్న( Tarakaratna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.గతా ఏడాది ఆయన మరణించిన విషయం తెలిసిందే.

 Taraka Ratna Wife Alekhya Gets Emotional On His First Death Anniversary-TeluguStop.com

తారకరత్న మరణాన్ని ఇప్పటికీ నందమూరి అభిమానులు ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా కళ్ళ ముందు మొదలుతూనే ఉన్నాయి.

రాజకీయాలపై ఉన్న ఆసక్తితో తొలి అడుగు వేయగా ఆ తొలి అడుగు ఆయన జీవితానికి ఆఖరి అడుగుగా మారింది.ఊహించని పరిణామాలతో చిన్నవయుసులోనే గుండెపోటుతో తారకరత్న మరణించిన విషయం తెలిసిందే.

అయితే తారకరత్నకు అలేఖ్యరెడ్డితో( Alekhya Reddy ) పెళ్లి కాగా వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.అయితే నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) అండతో అలేఖ్య మెల్లగా కోలుకునేలోపు తారకరత్న మరణించి ఏడాది పూర్తయ్యింది.దానితో అలేఖ్య మరోసారి కన్నీటి పర్యంతమైంది.భర్త మరణంతో ఒంటరిదైన అలేఖ్య తరచూ భర్త జ్ఞాపకాల్లో మునిగిపోయింది.ఇక తాజాగా ఆమె తారకరత్నని తలుచుకుంటూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.ఆమె సోషల్ మీడియాలో ఈ విధంగా రాదుకొచ్చింది.

నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యేకొద్దీ నేను పడుతున్న బాధ, నా గుండెల్లో నొప్పి ఎవరికీ చెప్పలేనిది.

18-02-23 నుంచి నీకు నాకు ఎలాంటి హద్దులు లేవు, రెండు విభిన్న ప్రపంచాల నుంచి మేము మా ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తాం.అందులో ఎలాంటి మార్పు ఉండదు. మీ ప్రేమ, మీ ఉనికి మీరు మాపై చూపిన ప్రభావం ఎప్పటికి మరువలేము, నేను నిన్ను తాకలేను, కానీ నీ ఉనికి ఎప్పటికి మా చుట్టూనే ఉంటుంది.

నువ్వే మా బలం, నువ్వు ఎన్నటికీ మాతోనే ఉంటావు అంటూ అలేఖ్య తారకరత్నని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube