టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
అందులో భాగంగానే ఇటీవలే భోళా శంకర్, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు చిరు.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట( Vashsishta ) దర్శకత్వంలో రూపొందించబోతున్న విశ్వంభర( Vishwambara ) అనే సినిమాలో నటించబోతున్నారు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో కూడా అడుగుపెట్టబోతున్నారు చిరు.
కాగా చిరంజీవికి మంచి కథ పడాలే కానీ పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే చిరు చరిష్మాను ద్రుష్టిలో పెట్టుకొని ఒక నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవికి ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తమ చిత్రానికి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్( 100Crore Remuneraion ) చేసినట్లు సమాచారం.ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానుల ఫాలోయింగ్‌కు తగినట్లుగా చిరంజీవికి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేయబడింది.అయితే అతను సరైన స్క్రిప్ట్, దర్శకుడి కోసం వెతుకుతున్నందున ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని టాలీవుడ్ లో టాక్ గట్టిగా నడుస్తోంది.

అయితే అతను ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ( People Media Factory )తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నాడు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పెద్ద చిత్రాలను విడుదల చేస్తోంది.సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో బ్రో లో పనిచేసింది.
ప్రస్తుత స్టార్ ప్రభాస్‌తో రాజాసాబ్( Rajasaab ) అనే భారీ ఎంటర్‌టైనర్‌ను నిర్మించింది.పెద్ద హీరోలతో పని చేసి నిర్మాణంలో మంచి గుర్తింపు సాధించింది.
అయితే నిర్మాత టి జి విశ్వప్రసాద్ కూడా చిరంజీవిని రెండుసార్లు కలిశాడు.ఇద్దరి కాంబోలో సినిమా వచ్చే అవకాశాలున్నాయట.
చిరంజీవి తన కుమార్తె సుస్మిత కొణిదెలతో కలిసి సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.







