మళ్లీ అదే పాత్రలో నాగ్.. ఈసారి ఏమవుతుందో?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం సరైన హిట్స్ లేక ఇతర హీరోలతో పోల్చుకుంటే వెనకబడిపోయాడు.నాగ్ నటించిన రీసెంట్ మూవీ మన్మధుడు 2 కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెడుతున్నాడు నాగ్.

 Nagarjuna To Play Cop In Solomon Movie-TeluguStop.com

అయితే ఇంకా ఎలాంటి సినిమాను ఓకే చేయని నాగ్, తన నెక్ట్స్ మూవీని ఓ కొత్త దర్శకుడితో చేయబోతున్నట్లు తెలుస్తోంది.

సోలోమన్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు నాగ్ బాగా ఇంప్రెస్ అయ్యి అతడి డైరెక్షన్‌లో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో నాగ్ పాత్రపై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.ఈ సినిమాలో నాగ్ మరోసారి కాప్ అవతారంలో మనకు కనిపిస్తాడట.పవర్‌ఫుల్ కాప్ కథను సోలోమన్ నాగ్‌కు వినిపించినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో మరసారి సక్సెస్ ట్రాక్‌ను అందుకోవాలని నాగ్ ప్రయత్నాలు చేస్తున్నాడు.

రియలిస్టిక్ కథతో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.ఇక ఈ సినిమాను నాగ్ స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేయనున్నాడు.

ఈ సినిమాను వీలైనంత త్వరగా మొదలుపెట్టేందుకు నాగ్ అండ్ కో రెడీ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube