ఫీజుల పెంపుపై పాలిటెక్నిక్ కాలేజీలకు అనుమతిస్తూ టీఎస్ హైకోర్టు ఉత్తర్వులు

డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఫీజులు పెంచాలని హైకోర్టులో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 Ts High Court Orders Allowing Polytechnic Colleges To Increase Fees-TeluguStop.com

అయితే ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించినా విద్యాశాఖ స్పందించలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని తెలిపింది.

దీనిపై వారంలోగా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ తరపు న్యాయవాది న్యాయస్థానానికి వెల్లడించారు.విద్యాశాఖ కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.

అటు పాలిటెక్నిక్ కాలేజీలు కోరినట్లుగా ఫీజుల పెంపునకు అనుమతించక తప్పడం లేదని హైకోర్టు పేర్కొంది.ఫీజు రూ.40 వేలకు పెంచేందుకు ఐదు పాలిటెక్నిక్ కాలేజీలకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.అదేవిధంగా ఏఎఫ్ఆర్సీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ప్రభుత్వం తక్కువగా ఫీజు ఖరారు చేస్తే విద్యార్థులకు ఫీజు వెనక్కి ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు షరతు విధించింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube