ఏపీ సీఎం జగన్( CM Jagan ) రేపు ప్రకాశం జిల్లాలో( Prakasam District ) పర్యటించనున్నారు.ఇందులో భాగంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్ – 2 ను( Poola Subbaiah Veligonda Project Tunnel – 2 ) ఆయన ప్రారంభించనున్నారు.
దోర్నాల మండలం ఎగువ చేర్లోపల్లిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం జగన్ ఫైలాన్ ను ఆవిష్కరించనున్నారు.
అనంతరం వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును సీఎం జగన్ పరిశీలించనున్నారు.తరువాత టన్నెల్ -2 ను జాతికి అంకితం చేయనున్నారు.కాగా సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు.