మహానాడు ( Mahanadu )తరువాత తెలుగుదేశం పార్టీ( TDP Party ) దూకుడు పెంచింది.అధికార పార్టీ వైసీపీని( YCP ) మరింతగా టార్గెట్ చేసుకుంది.
టిడిపి మేనిఫెస్టో ప్రజా రంజకంగా ఉందని, దీనిని ప్రజలు తప్పక ఆమోదిస్తారని, రాబోయే ఎన్నికల్లో తమదే విజయమనే ధీమాలో చంద్రబాబు( Chandrababu naidu ), ఆ పార్టీ నాయకులు ఉన్నారు.ఇప్పుడు విడుదల చేసిన మేనిఫెస్టో ( Manifesto )జస్ట్ శాంపిల్ మాత్రమేనని, అసలు మేనిఫెస్టో ముందుందని, అది చూస్తే వైసిపి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక వైసిపి ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, దీనిపై టిడిపి వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది.దీనిలో భాగంగానే రాష్ట్రాన్ని ప్రజలను జగన్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో తెలియజేస్తూ అనేక అంశాలను వివరిస్తూ టిడిపి చార్జిషీట్ ను విడుదల చేసింది.
నాలుగేళ్ల క్రితం ప్రజా వేదిక కూల్చివేతతో వైసిపి ప్రభుత్వం పరిపాలన మొదలైందని విమర్శలు మొదలుపెట్టారు.ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ చూసినా గందరగోళం చోటు చేసుకుంటుందని, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని టిడిపి ప్రధానంగా ఆరోపిస్తోంది.
సంక్షేమ పాలన అందిస్తామని చెప్పి బూటక సంక్షేమాన్ని అందిస్తున్నారని జగన్ ప్రభుత్వం పై టిడిపి నేతలు ఫైర్ అవుతున్నారు.గతంలో టిడిపి ప్రభుత్వ అమలు చేసిన పథకాలకు ( to schemes )పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారని టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు విమర్శిస్తున్నారు.వైసిపి నాలుగేళ్ల పరిపాలనలో అన్ని ఘోరాలు, నేరాలే అంటూ విమర్శించారు .అసలు ఈ నాలుగేళ్ల కాలంలో ప్రజలకు ఏం మేలు చేశారు చెప్పాలని వైసీపీ నేతలను డిమాండ్ చేస్తున్నారు.
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కి లేనన్ని ఆస్తులు జగన్ ( Jagan )కు ఉన్నాయని, అత్యంత ధనిక సీఎంగా జగన్ మొదటి స్థానాన్ని సంపాదించారని, ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ రెడ్డి అత్యంత ధనికుడిగా ఎదిగితే పేదవాళ్లు అత్యంత పేదవాళ్ల స్థాయికి చేరుకున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా విమర్శించారు.ఇక ఇవే అంశాలను హైలెట్ చేస్తూ జనాల్లోకి వెళ్లి వైసిపి పాలనపై విమర్శలు చేయాలని, ప్రజలను ఆలోచన రేకెత్తించే విధంగా వ్యవహరించాలని, ఎన్నికలో వరకు ఏదో ఒక అంశంపై ఇదేవిధంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి పై చేయి సాధించాలనే లక్ష్యంతో టిడిపి ముందడుగులు వేస్తోంది.దీంతో పాటు టిడిపి ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.