సాధారణంగా చాలామంది వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం ఇంటిని నిర్మించుకుంటూ ఉంటారు.అదేవిధంగా ఇంట్లో వస్తువులను కూడా అరేంజ్ చేసుకోవాలి.
కానీ కొంతమంది వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్నప్పటికీ ఇష్టానుసారంగా వస్తువులను మాత్రం ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటారు.అయితే ఇది మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరి ముఖ్యంగా వాస్తు శాస్త్రంలో అద్దాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.అందుకే అద్దాలను సరైన దిశలో ఉంచడం మంచిది.
అయితే అద్దం ఇంట్లో ఏ దిక్కున ఉంటే ఆ ఇంటికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
అద్దాలను ఎప్పటికీ సరైన దిశలో ఉంచడం చాలా అవసరం.ఎందుకంటే అద్దాలు సానుకూల లేదా ప్రతికూల శక్తికి మూలం కావచ్చు.కాబట్టి అద్దాలు( mirror )ఏ దిశలో ఉంచితే మంచిదని తెలుసుకోవాలి.
అద్దాన్ని ఎల్లప్పుడూ కూడా దక్షిణ లేదా పడమర దిశలో ఉంటే తీసేయాలి.అలాగే ఈ దిశలలో మీ ఇంట్లో ఏ గాజు వస్తువు ఉన్నా కూడా వెంటనే దాన్ని తీసివేయాలి.
ఎందుకంటే ఈ దిక్కులలో అద్దం పెడితే ఆ ఇంటి కుటుంబ సభ్యులకు ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.అలాగే ఇంటి సభ్యుల మధ్య విభేదాలు పెరిగిపోతాయి.
ఇక రోజు రోజుకు ఇంట్లో చాలా గొడవలు జరుగుతాయి.అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన గాజు కూడా ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు.
అలాగే పగిలిన అద్దంలోను కూడా ముఖం అస్సలు చూసుకోకూడదు.పగిలిపోయిన గాజు వస్తువులను ఇంట్లో వాడితే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నిండిపోతుంది.
దీంతో ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనిలో అయినా అభివృద్ధికి నోచుకోకుండా అడ్డంకులను ఎదుర్కొంటూ ఉంటారు.ఇక అద్దం ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండాలి.
అందుకే మీ ఇంట్లోని వాష్ బేస్ దగ్గర గ్లాస్ పై నీటి మరకలు ( Water stains )పడితే ఎప్పటికప్పుడు అద్దాన్ని శుభ్రపరచాలి.ఎందుకంటే అద్దం పై మరకలు ఉంటే ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి.కాబట్టి ఆ శక్తి గాజు పలకలపై ప్రవహిస్తుంది.అంతేకాకుండా ఉదయాన్నే నిద్ర లేచిన సమయంలో పడకగదిలో ఉన్న అద్దాన్ని చూసుకోకూడదు.అదేవిధంగా బాత్రూంలోనూ కూడా అద్దాలు ఉంచడం అంత మంచిది కాదు.అందుకే అద్దాన్ని దక్షిణం, పడమర దిశలో కాకుండా తూర్పు దిశలలో ఉంచుకోవడం మంచిది.
LATEST NEWS - TELUGU