జంధ్యాల. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయమక్కర్లేదు ఏమో.ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని ఖ్యాతిని సంపాదించారు జంధ్యాల.ఒక దర్శకుడిగా మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలిగా కూడా ప్రతిభ చాటారు.
ఇక నటులకు గాత్ర దానం చేసి ఇక ఆయా పాత్రల్లో కూడా జీవించిన వ్యక్తి గా మారిపోయారు జంధ్యాల.ఇక జంధ్యాల పూర్తిపేరు శ్రీ జంధ్యాల వీర వెంకట శివ సుబ్రహ్మణ్య శాస్త్రి.
ఇప్పటివరకు జంధ్యాల తన గొంతును అరువిచ్చి ఇతర భాషల నటీ నటులను కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గర ఎలా చేశారు.ఇక అలాంటి సినిమాలు ఏవో ఇప్పుడు చూసుకుందాం.
అరుణాచలం :
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన అరుణాచలం సినిమాలో విస్సు గారికి డబ్బింగ్ చెప్పారు జంధ్యాల.సాధారణంగా చాలా సినిమాల్లో ఇక విస్సు గారికి బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ చెబుతూ ఉండేవారు.కానీ ఆ తర్వాత మాత్రం ఇక జంధ్యాల డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు.
భారతీయుడు:
కమల్హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు సినిమా లో నిజాయితీ గల సిబిఐ ఆఫీసర్ గా నటించిన వేణు గారికి డబ్బింగ్ చెప్పి ప్రేక్షకులను అలరించారు జంధ్యాల.

పడమటి సంధ్యారాగం :
ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర దారి సినిమా నిర్మాతల్లో ఒకరైన మీర్ అబ్దుల్లాకు గాత్ర దానం చేసి ఇక ఆయన పాత్రకు ప్రాణం పోశారు.అయితే ఈ సినిమా అమెరికాలో తీయడం వల్ల అక్కడి నటీనటులను తీసుకొని ఇక మనకు తెలిసిన నటులతో డబ్బింగ్ చెప్పించి ప్రేక్షకులకు పాత్రలను దగ్గర చేశారు.
దొంగ దొంగ:
సినిమాలో విలన్ పాత్రలో నటించిన సలీం గౌస్ కి కూడా జంధ్యాల తన స్వరాన్ని అరువుగా ఇచ్చారు అని చెప్పాలి.ఇక సలీం ముగ్గురు మొనగాళ్లు సహా మరికొన్ని సినిమాల్లో నటించగా ఈ సినిమాలకు కూడా జంధ్యాల వాయిస్ ఇవ్వడం గమనార్హం.

చూపులు కలిసిన శుభవేళ :
సినిమాలో సుత్తి వీరభద్ర రావు కి డబ్బింగ్ చెప్పారు జంధ్యాల.అయితే వీరభద్రరావు ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునే వారు కానీ 1988లో హఠాత్ మరణం చెందడంతో చివరికి ఆయన పాత్రకు జంధ్యాల చెప్పే బాధ్యత తీసుకున్నారు.
మెరుపు కలలు :
ఈ సినిమాలో గిరీష్ కి ఇక జంధ్యాల స్వరాన్ని అందించి పాత్రకు ప్రాణం పోశారు.ఇక గిరీష్ హావభావాలు ఏకంగా జంధ్యాల గొంతుతో వింటూ ప్రేక్షకులు అంతరించి పోయారు

ఇద్దరు :
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కి డబ్బింగ్ చెప్పారు జంధ్యాల.మొదట్లో జంధ్యాల డబ్బింగ్ ఈ సినిమాలో ప్రేక్షకులకు కాస్త నచ్చలేదు.కానీ వినగా వినగా ఒక వయసు మళ్ళిన ప్రకాష్ రాజ్ రాత్రికి జంధ్యాల వాయిస్ బాగా సరిపోయింది అనిపిస్తుంది.
భామనే సత్య భామనే:
ఇక ఈ సినిమాలో కూడా జెమినీ గణేషన్ కి తన గాత్రాన్ని అందించారు జంధ్యాల.ఆడవేషంలో ఉన్న కథానాయకుడి పాత్ర తన ప్రేమను వ్యక్త పరుస్తూ సిగ్గు పడుతుంటే ఆ భావానికి ప్రత్యేకమైనఆకర్షణ తీసుకువచ్చారు అని చెప్పాలి.
ఇలా ఎన్నో సినిమాల్లో జంధ్యాల డబ్బింగ్ తో కూడా ప్రేక్షకులను అలరించారు.







