బంపరాఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. 60 రోజుల పాటు డేటా, కాల్స్ ఫ్రీ!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను తీసుకొస్తోంది.ఇందులో భాగంగా తాజాగా ఇదొక బంపర్ ఆఫర్ ప్రకటించింది.

 Bsnl Announced By Bumper Data For 60 Days, Calls Free! Bsnl, Bumber Offer, 60 Days, Free Mobile Data, Free Calls-TeluguStop.com

అదేంటంటే 60 రోజుల పాటు 2జీబీ డేటా, కాల్స్, ఎస్ఎంఎస్‌లు ఫ్రీగా ఇస్తామని తెలిపింది.అయితే మీరు ఈ ఫ్రీ బెనిఫిట్స్ పొందాలంటే ఇయర్లీ రీఛార్జి ప్లాన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఒక సంవత్సరానికి మీరు రూ.2,399 ప్లాన్‌ని యాక్టివేట్ చేసుకోవచ్చు.ఈ ప్లాన్‌పై బీఎస్ఎన్ఎల్ 60 రోజుల ఫ్రీ వ్యాలిడిటీ ఆఫర్‌ను తీసుకొచ్చింది.దీని అర్థం మీరు ఎప్పటిలా 365 వ్యాలిడిటీ కాకుండా.మొత్తంగా 425 రోజులు డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ అందుకోవచ్చు.అలా చూసుకుంటే 60 రోజుల పాటు మీకు ఉచితంగా అన్ని బెనిఫిట్స్ లభిస్తాయని చెప్పవచ్చు.

 BSNL Announced By Bumper Data For 60 Days, Calls Free! BSNL, Bumber Offer, 60 Days, Free Mobile Data, Free Calls-బంపరాఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.. 60 రోజుల పాటు డేటా, కాల్స్ ఫ్రీ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే వార్షిక ప్లాన్‌లో బీఎస్ఎన్ఎల్ మరిన్ని బెనిఫిట్స్ అందిస్తోంది.అందులో 30 రోజుల ఎరోస్ నౌ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది.రూ.2,399 ఇయర్లీ ప్లాన్‌పై బీఎస్ఎన్ఎల్ అప్పుడప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది.2022 జనవరిలో 90 రోజుల పాటు వ్యాలిడిటీని పెంచి కస్టమర్లకు చాలా డబ్బు ఆదా అయ్యేలా చేసింది.ప్రస్తుతం కస్టమర్లు కనీసం 400 రూపాయలు మిగుల్చు కునేందుకు ఈ ఆఫర్ ఉత్తమంగా నిలుస్తుంది.

అయితే మొబైల్ యూజర్లు గమనించాల్సిన ఒక విషయం ఉంది.అదేమిటంటే దేశంలో బీఎస్ఎన్ఎల్ 3జీ ఇంటర్నెట్ సేవలను మాత్రమే ఆఫర్ చేస్తోంది.4జీ నెట్‌వర్క్ సేవలను మూడు నెలల్లో తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చేస్తోంది. ఆగస్టు – సెప్టెంబర్ నెలల వరకు ఈ నెట్‌వర్క్ యూజర్లకు 4జీ సేవలు అందుబాటులోకి రావాలని తెలుస్తోంది.

ఆ తర్వాత వీరు కూడా 4జీ సేవలు ఆస్వాదించవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube