ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకే పరిమితమైన టీడీపీ ప్రస్తుతం తెలంగాణలోనూ బలపడటానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఫలితాలు కలిసి రాకపోవడంతో పూర్తిగా కనుమరుగైంది.
అయితే సరైన లీడర్లు లేకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ పార్టీ క్యాడర్ ఉందనే చెప్పాలి.అయితే ఇప్పుడు అధినేత చంద్రబాబు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయడానికి ఇటీవల పలు చోట్ల ఇన్ చార్జులను సైతం నియమించారు.
వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పుట్టిందే తెలంగాణలో.పార్టీ అధినాయకుడు చంద్రబాబు భావి వారసుడు లోకేష్ ఈ రోజుకీ ఉంటున్నది కూడా తెలంగాణాలోనే.
టీడీపీకి బ్రహ్మాండమైన పార్టీ ఆఫీస్ ఉన్నది కూడా హైదరాబాద్ లోనే.అయితే రాష్ట్ర విభజన తరువాత టీడీపీని కేవలం ఏపీకి మాత్రమే పరిమితం చేయడంతో తెలంగాణలో పార్టీ కనిపించకుండా పోయింది.
ఇన్ చార్జులను నియమించి.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సెంట్ మెంట్ గాలి వీయడంతో పూర్తిగా టీఆర్ఎస్ జెండా ఎగిరింది.దీనికి తోడు బాబు కూడా కొన్ని తప్పిదాలు చేయడంతో తెలంగాణలో పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసి మరింత డ్యామేజ్ చేసుకున్నారు.మొత్తానికి నాలుగేళ్లుగా టీడీపీ తెలంగాణలో కనుమైరుగైందనే చెప్పాలి.ఈ నేపథ్యంలో సడెన్ గా అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది.బాబు ఆ మధ్యన తెలంగాణ టూర్లో టీడీపీని పటిష్టం చేస్తామని చెప్పారు.ఇపుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారనే చెప్పాలి.

రీసెంట్ గా కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడిగా వంచె శ్రీనివాస్ రెడ్డిని నియమించారు.అదే విధంగా పలు శాసనసభ నియోజకవర్గాల ఇంచార్జీలను నియమించారు.కంటోన్మెంట్ కి గడ్డి పద్మావతి అంబర్ పేటకు రాగిపణి ప్రవీణ్ కుమార్ అలియాస్ బిల్డర్ ప్రవీణ్ జనగాంకి రామిని హరీశ్ ను నియమించారు.సిరిసిల్లకు అవునురి దయాకర్ రావును నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
అయితే బలమైన నేతలు లేనప్పటికీ పార్టీకి ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, నిజమాబాద్, కరీం నగర్ వంటి ప్రాంతాల్లో పార్టీ క్యాడర్ ఉంది.దీంతో క్యాడర్ ని యాక్టివ్ చేయడానికి ఈ నియామకాలు చేపట్టారని అంటున్నారు.
రానున్న రోజుల్లో బలమున్న చోట ఇన్ చార్జిలను నియమించడం ద్వారా 2023లో జరిగే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా తమ వంతు పాత్ర ఉండేలా కృషి చేస్తున్నారు.ఇక తెలంగాణ కొత్త అసెంబ్లీలో టీడీపీ ఉండేలా బాబు కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు.