టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాలో అమ్మడి లుక్స్ పరంగా సరికొత్తగా కనిపించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా షూటింగ్‌లో ఇప్పటికే చిత్ర నటీనటులు పాల్గొంటున్నారు.అయితే సౌత్ ఇండియాలో ఎప్పటినుండో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, ఎట్టకేలకు ఓ స్టార్ హీరోతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు నటించబోతున్న నెక్ట్స్ మూవీలో జాన్వీని హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమాను బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ నిర్మించబోతున్నాడని, డైరెక్షన్ బాధ్యతలు ఓ కొత్త దర్శకుడి చేతిలో పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా ఉండబోతుందని, ఇందులో మహేష్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.
మరి ఈ వార్తలో ఎలాంటి నిజం ఉందో తెలియాలంటే ఈ సినిమా గురించిన అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.ఇక మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంపై కూడా ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.