వేసవిలో పర్యాటకులు హిల్ స్టేషన్లను సందర్శిస్తారు.హిల్ స్టేషన్లలో వేసవిలో కూడా చల్లగా ఉంటుంది.
వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.మార్చి నుండి అక్టోబరు వరకు హిల్ స్టేషన్లలో పర్యాటకుల రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయి.
పర్యాటకులు వేసవి సెలవులను గడపడానికి హిల్ స్టేషన్లకు వెళతారు.వారి కుటుంబసభ్యులు, స్నేహితులతో కొన్ని రోజులు ప్రశాంతంగా అక్కడ కాలం గడుపుతారు.
ఏది ఏమైనప్పటికీ హిల్ స్టేషన్‌లను సందర్శించడం మనిషికి ఉల్లాసాన్ని, ఉత్సాహన్ని అందిస్తుంది.అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది.
స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలువబడే ఒక హిల్ స్టేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ హిల్ స్టేషన్ దక్షిణ భారతదేశంలో ఉంది.

కూర్గ్‌ని స్కాట్‌లాండ్ ఆఫ్ ఇండియా( Scotland of india ) అంటారు.కూర్గ్ చాలా అందమైన హిల్ స్టేషన్( coorg ).ఈ హిల్ స్టేషన్ కర్ణాటకలో ఉంది.ఇక్కడి ప్రకృతి అందాల కారణంగా ఈ హిల్ స్టేషన్‌ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.
ఈ అందమైన హిల్ స్టేషన్ ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు స్వర్గధామం.కూర్గ్‌లోని అద్భుతమైన దృశ్యాలు పర్యాటకుల హృదయాన్ని గెలుచుకుంటాయి.కూర్గ్‌కు వచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలను చూసి మైమరచిపోతారు.ఇక్కడి అడవులు, లోయలు, వాతావరణం పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
ఈ హిల్ స్టేషన్ కావేరీ నది ఒడ్డున ఉంది.దాని సహజ అందాల కారణంగా పర్యాటకం పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది.

కాఫీ తోటలకు ప్రసిద్ధికూర్గ్ సుగంధ ద్రవ్యాలు మరియు కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందింది.ఇక్కడ పలు కాఫీ తోటలను సందర్శించవచ్చు.దీనితో పాటు, పర్యాటకులు కూర్గ్‌లోని జలపాతాలు, కోటలు, పురాతన దేవాలయాలు మరియు టిబెటన్ నివాసాలను సందర్శించవచ్చు.ఇక్కడి ఓంకారేశ్వర్ ఆలయాన్ని సందర్శించవచ్చు.శివునికి నిలయమైన ఈ ఆలయం 1820లో నిర్మితమయ్యింది.ఈ ప్రాంతంలోని పురాతన ఆలయంగా పేరొందింది.
ఇదేకాకుండా మీరు కూర్గ్‌లోని బ్రహ్మగిరి వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించవచ్చు.

ఈ అభయారణ్యం 1974 సంవత్సరంలో ఏర్పాటయ్యింది.ఈ అభయారణ్యంలో వివిధ రకాల జంతువులను చూడవచ్చు.కూర్గ్‌లోని పాడి ఇగ్గుతప్ప ఆలయాన్ని పర్యాటకులు సందర్శిస్తుంటారు.
ఈ ఆలయాన్ని ఓంకారేశ్వర్ ఆలయంకన్నా పదేళ్ల ముందే నిర్మించారు.ఇక్కడికి వచ్చే పర్యాటకులు తలకావేరి వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించవచ్చు.
కూర్గ్‌లోని భంగండేశ్వర్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.







