అంగరంగ వైభవంగా జరిగిన మల్లన్న బోనాల జాతర.. 60 వేల బోనాలను..

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో ఆదివారం బోనాల జాతర ఎంతో ఘనంగా జరిగింది.అతి పెద్ద జాతరగా పేరు ఉన్న పెద్దాపూర్ మల్లన్న(Peddapur Mallanna)కు దాదాపు 60 వేలకు పైగా బోనాలను భక్తులు సమర్పించారు.

 Mallanna Bonala Fair Held With Grandeur.. 60 Thousand Bonalu , Mallanna Bonala-TeluguStop.com

ఉపవాస దీక్షలతో వండిన బోనాలను నెత్తిన పెట్టుకొని మల్లన్న దేవాలయం(Mallanna Temple) చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు.

ముఖ్యంగా చెప్పాలంటే భక్తులు బెల్లం, గొర్రె పిల్లలను కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇంకా చెప్పాలంటే ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, కళాకారులను నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఆ తర్వాత మల్లన్న స్వామి రథోత్సవాన్ని భక్తుల హర్షధ్వానాల మధ్య కన్నుల పండుగ నిర్వహించారు.

జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత(Dava vasanta),కోరుట్ల ఎమ్మెల్యే టిఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(Kalvakuntla Vidyasagar Rao), టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేత కల్వకుంట్ల సంజయ్(Kalvakuntla Sanjay) తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా చెప్పాలంటే భువనగిరి నియోజకవర్గం యాదగిరిగుట్ట మండలంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అయినటువంటి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.ఈ సందర్భంగా వరుస సెలవులు రావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు.

కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్య స్థానాలు ఆచరించిన భక్తులు ఇష్ట దైవాల దర్శనాల కోసం కొండ పైకి చేరుకున్నారు.కొండపైన దేవాలయ తిరువీధులు స్వామివారి దర్శనాల క్యూ లైన్లు భక్తులతో రద్దీగా ఉన్నాయి.దాదాపు 35 వేల మంది భక్తులు లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోగా, ధర్మ దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని దేవాలయ అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube