ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.50
సూర్యాస్తమయం: సాయంత్రం 05.49
రాహుకాలం: ఉ.7.30 ల9.00 వరకు
అమృత ఘడియలు:ఉ.9.30 ల11.30
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38 ల3.20 సా4.11వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మీ వ్యక్తి విషయాలను పంచుకోకపోవడమే మంచిది.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
వృషభం:
ఈరోజు వ్యాపారస్తులకు కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు.సమాజంలో మంచి పలుకుబడి పెరుగుతుంది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.
మిథునం:
ఈరోజు మీరు అనవసరంగా ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా ఉండడమే మంచిది.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి బయట పడతారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.తొందరపడి మీ సొమ్మును ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు.శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.
సింహం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.నూతన పరిచయాల వలన కొత్త విషయాలు తెలుసుకుంటారు.దీనివల్ల మీకు మనశ్శాంతి ఉంటుంది.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
కన్య:
ఈరోజు అనుకోకుండా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.మీ జీవిత భాగస్వామి నుండి సహాయం అందుతుంది.
తులా:
ఈరోజు మీరు స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి.ప్రయాణంలో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
ధనస్సు:
ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన సమస్యలను ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
మకరం:
ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.మీ స్నేహితులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
కుంభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఈరోజు ఏదైనా పని మొదలు పెడితే విజయవంతంగా సాగుతుంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మీనం:
ఈరోజు వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మీ తోబుట్టువులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
చాలా ఉత్సాహంగా ఉంటారు.
LATEST NEWS - TELUGU