శ్రీరాముని గురించి స్టేజిపై ప్రసంగిస్తూ కుప్పకూలిన ప్రొఫెసర్ వీడియో వైరల్..

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎన్నో లక్షల వీడియోలు ప్రతిరోజు షేర్ అవుతూ ఉంటాయి.ఇలా షేర్ అయినా కొన్ని వీడియోలు నవ్వును తెప్పిస్తూ ఉంటే, మరి కొన్ని వీడియోలు బాధ కలిగిస్తూ ఉంటాయి.

 The Video Of The Professor Collapsing While Speaking On The Stage About Sri Ram-TeluguStop.com

ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది డాన్సులు చేస్తూ, స్టేజీల పైన మాట్లాడుతూ కింద పడిపోయి గుండెపోటుతో మృతి చెందుతున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి.

అలాంటి ఒక సంఘటన లో హనుమాన్‌ జయంతి సందర్భంగా రాముడి గురించి ప్రసంగిస్తూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఒకరు గుండె పోటుకు గురై తుది శ్వాస విడిచారు.

భగవంతుడి కథ చెప్తూనే ప్రాణాలు కోల్పోవడంతో ఛాప్రా పట్టణం అంతా శోకసముద్రంలో మునిగిపోయింది.బిహార్‌లో హనుమాన్‌ జయంతి సందర్భంగా తులసీదాస్‌ రామాయణాన్ని వినిపిస్తున్న ఓ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ అదే స్టేజిపై ప్రాణాలొదిలారు.

రాముడి కథ చెప్తూ చెప్తూ గుండె పోటుకు గురై కుప్పకూలారు.

వెంటనే ఆ కార్యక్రమం నిర్వాహకులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు చెప్పారు.

ఈ విషాద ఘటన బిహార్‌లోని ఛాప్రాలో శనివారం సాయంత్రం జరిగింది.ఈ కార్యక్రమాన్ని లైవ్‌గా ప్రసారం చేస్తుండటంతో ఆయన మృతిచెందిన విషయం అందరికీ త్వరగా తెలిసిపోయింది.

అంతేకాకుండా ఈ విషయం సోషల్‌ మీడియాలో కూడా వీడియో వైరల్‌గా మారింది.ఈ వీడియోను చూసినా వారందరూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

కొంతమంది బాధపడుతూ అయ్యో పాపం అని కామెంట్లు చేస్తే, మరికొంతమంది శ్రీరాముని పేరు పలుకుతూ చనిపోయిన పుణ్యమూర్తి అని కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఆలయంలో అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించే రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ గుండెపోటుతో చనిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ ఎంతో బాధ పడుతున్నారు.పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి ఆయన భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.దేవుడి పేరు చెప్తూనే కన్నుమూయడంతో ఎంతో పుణ్యం చేసుకున్నారంటూ స్థానికులు ప్రొఫెసర్ ను ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube