సినిమాలు ఓటీల్లోకి వచ్చినా సరే ఇంట్లో మహిళలకు మాత్రం సీరియల్స్ అంటేనే ఇష్టం.వీరి ఆసక్తిని మరింత పెంచేలా సీరియల్స్ లో ట్విస్టులు ఇస్తుంటారు.
ఒక్కోసీరియల్ ఏడాది పాటు కొనసాగుతుంది అంటే అదంతా మన మహిళా మూర్తుల చలువే అని చెప్పొచ్చు.అయితే ఒకప్పుడు సీరియల్ అంటే కేవలం టీవీల్లోనే చూసేవారు.
కానీ ఇప్పుడు స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఫోన్లు వచ్చే సరికి వారు కూడా అప్డేట్ అవుతున్నారు.ఒకవేళ వారు రెగ్యులర్ గా చూసే సీరియల్ మిస్ అయ్యేట్టు ఉంటే ముందే రికార్డింగ్ పెట్టుకుని తర్వాత వచ్చి చూస్తున్నారు.
ఇది డీటీహెచ్ లలో.స్మార్ట్ టీవీలలో రెండిటిలో అందుబాటులో ఉంది.
ఇక మరోపక్క చాలామంది మహిళలు ఈమధ్య సీరియల్స్ అన్ని ఫోన్లోనే కవర్ చేస్తున్నారు.ఇప్పుడు దాదాపు అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.అందుకే సీరియల్స్ కూడా అందులో చూసేస్తున్నారు.ఒకప్పుడు సీరియల్ టైం లో కరెంట్ పోతే ఆ కరెంటోడిని కూడా తిట్టుకునే వారు.
ఇప్పుడు ఆ కరెంట్ వాడు కూడా తిట్లు తినకుండా స్మార్ట్ ఫోన్ తో మొబైల్ డేటాతో సీరియల్స్ చూస్తున్నారు.ఎలాగు ఇప్పుడు అన్ని ఛానెల్స్ వారి ఓటీటీల ద్వారా స్మార్ట్ ఫోన్ లో వచ్చేస్తున్నాయి.
స్టార్ మా సీరియల్స్ అన్ని డిస్నీ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంటున్నాయి.
అయితే కొన్ని సీరియల్స్ మాత్రం కేవలం టీవీల్లో చూసే అవకాశం ఉంది.వీరి సీరియల్స్ పిచ్చిని క్యాష్ చేసుకునేందుకు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఫలానా సీరియల్ లో రేపు జరగబోయేది ఇదే అంటూ హడావిడి చేస్తున్నారు.అలా కూడా వారి వ్యూస్ పెంచుకుంటున్నారు.
ఎలాగు బోలెడంత డేటా ఉంటుంది కాబట్టి సీరియల్స్ చూస్తున్నా సరే రేపు ఏం జరుగుతుంది అన్న ఎక్సయిట్ మెంట్ తో ఆ యూట్యూబ్ ఛానెల్స్ ని ఫాలో అవుతున్నారు మహిళలు.మొత్తానికి సీరియల్స్ వళ్ల అందులో నటించే వారికే కాకుండా ఇలా బయట వారికి కూడా ఆదాయ మార్గం అవుతుంది.