సికింద్రాబాద్: బోనాల జాతరను పురస్కరించుకొని సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలో పురవీదులన్నీ విద్యుత్ కాంతులతో జిగేలు మంటున్నాయి.వాటిని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాలనుండే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు తరలివస్తున్నారు.
వెస్ట్ మారేడ్ పల్లిలోని మైసమ్మ దేవాలయం వద్ద ఆలయ వ్యవస్థాపకుడు సీ కృష్ణయాదవ్ (గోళ్ళకిట్టు) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల ద్వారాలు, వివిధ దేవతామూర్తుల అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఆదివారం బోనాలు, సోమవారం ఫలహారం బండ్ల ఉరేగింపు ఉండగా రెండు రోజుల ముందు నుండే ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది.
ఆలయానికి వేసిన రంగులు, అమ్మవారి అలంకరణ, దేవాలయానికి వేసిన విద్యుత్ దీపాలు చూపరులను కల్లుతిప్పుకొనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.