ధనుర్మాసంలో శ్రీవారికి సుప్రభాతానికి బదులు తిరుప్పావై ఎందుకు చదువుతారు?

ఏడు కొండల వేడు ఆ శ్రీ వేంకటేశ్వరుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే ప్రతీ ఒక్కరూ తిరుపతి క్చితంగా చూడాలని కోరుకుంటారు.

 Why Read Thiruppavai Instead Of Suprabhatham To Swamy Varu In Dhanurmasam , Devo-TeluguStop.com

అంతేనా ఎంత కష్టం అయినా సరే వెళ్లి ఆ స్వామి వారిని దర్శించుకోవాలని అనుకుంటారు.అయితే అలాంటి పుణ్య క్షేత్రంలో.

ధనుర్మాసంలో తిరుప్పావై సంకీర్తన గానం చేయడం శ్రీ భగవత్ రామానుజులు చేసిన ఏర్పాటును అనుసరించి జరుగుతున్నది.పూర్వం గోపికలు కాత్యాయనీ వ్రతంతో శ్రీ కృష్ణుణ్ణి సేవించారు.

గోదా దేవి కూడా వారి మార్గాన్ని అనుసరించి ధనుర్మాసంలో ఆ వ్రతాన్ని అనుష్ఠిస్తూ రోజుకొక్క పాశురం చొప్పున ముప్పది పాశురాలు గానం చేసింది.ఆమె చేసిన వ్రతాన్నే ‘తిరుప్పావై‘ వ్రతం అన్నారు.

శ్రీ రామానుజుల వారు తిరుమల ఆలయంలో పూజా విధానాలను క్రమబద్ధం చేస్తూ ధనుర్మాసంలో నిత్యం ‘తిరుప్పావై’ పఠించేటట్లు కట్టడి చేశారు.

భక్తా గ్రేసులు తిరుప్పావైని వేద సారమని భావిస్తారు.

ధనుర్మా సంలో శ్రీ వేంకటేశ్వర స్వామి శ్రీ కృష్ణుడుగా పూజింప బడతాడు.ఆ దేవుణ్ణి ఆరాధించే వారు గోపికలకు ప్రతీకలు.

గోదా దేవి శ్రీ లక్ష్మీ దేవి యొక్క మరో రూపము.అందువల్ల ఆమె పాడిన పాటలను ధనుర్మాసంలో పాడడం సంప్రదాయం అయింది.

అయితే ఇదే పద్దతి వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.ఇప్పటికీ వేద పండితులు, భక్తులు ఇదే పద్దతిని పాటిస్తున్నారు.

స్వామి వారికి తిరుప్పావై చేయడం వల్ల మనం కోరికున్న కోరికలు తీరుతాయని నమ్మకం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube