మహా అన్న పదం ఈశ్వరునికే ఎందుకు ఉందో తెలుసా?

మహా శివుడు అనే పేరులో మహా అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా.మహా అనే పదం అంటే మిగతా వాటి కంటే గొప్పది అని అర్థం.

 Do You Know Why The Word Maha Is Only For Eshwar , Devotional , Eshwarudu , Mah-TeluguStop.com

మిగిలిన వాటి కంటే గొప్పదైన వాటిని, అత్యుత్తమమైన వాటిని మహా అంటారు.ప్రతి నెల శివ రాత్రి పర్వదినం వస్తుంది.

ప్రతి బహుళ చతుర్ధసి రోజు వచ్చేది శివ రాత్రి.అయితే మాఘ బహుళ చతుర్దశి వచ్చే శివ రాత్రిని మహా శివ రాత్రి అంటారు.

అలాగే ప్రతి ఇంట్లో బారసాలా, నామ కరణం పుట్టిన రోజు, ఉనయనం వంటి ఎన్నో పండగలు జరుగుతుంటాయి.వీటిని మామూలు పండుగలుగానే పరిగణిస్తాం.

కానీ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్క సారి మాత్రమే జరిగే పెద్ద వేడుక.అందుకే దానిని కల్యాణాన్ని మహోత్సవం అంటాం.

సృష్టికి ఈశ్వరుడు బ్రహ్మ.స్థితికి ఈశ్వరుడు విష్ణువు.విద్యలకి ఈశ్వరుడు వినాయకుడు.సంగీతానికి ఈశ్వరి సరస్వతి.

ధనాలకి ఈశ్వరుడు కుబేరుడు.అందరూ ఈశ్వరులకూ ఈశ్వరుడు అంటే అందరినీ తన వశంలో ఉంచుకునే వాడు మహా+ఈశ్వరుడు అవుతాడు అతడే మహేశ్వరుడు.

మహా శివుడు అని కూడా అంటారు.శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవతల్లో ప్రధానమైన వాడు.

శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థం.ఈయన లయకారుడు.

సృష్టి ఎలా కదలాలి, ఎలా ఉండాలి అనేది శివయ్య అనుగ్రహం ప్రకారమే జరుగుతుంది.హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ప్రథముడు.

మహేశ్వరుడు పశుపతిగాను, లింగం రూపంలోనూ సింధు నాగరికత కాలానికే పూజలు అందుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube