వైరల్ పిక్.. అమ్మాయిల మధ్యలో వరుణ్ తేజ్.. ఇలా ఎందుకు దిగాడబ్బా..

నిన్న అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా మెగా హీరో వరుణ్ తేజ్ అమ్మాయిల మధ్య కూర్చుని దిగిన ఫోటో నెట్టింట వైరల్ అయ్యింది.

 Womens Day Varun Tej And His Happy Cousins, Womens Day, Varun Tej, Cousins, Niha-TeluguStop.com

ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది.ఇంతకీ వరుణ్ తేజ్ చుట్టూ కూర్చున్న అమ్మాయిలు ఎవరు? ఏంటా కథ అని తెలియాలంటే ఇది చదవాల్సిందే.

వరుణ్ తేజ్ అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఒక ఫోటో షేర్ చేసాడు.ఈ ఫోటో నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

ప్రపంచంలోని ఇంక్రెడిబుల్ ఉమెన్ అందరికి, ఈ రోజు మాత్రమే కాదు ప్రతి రోజు ప్రకాశిస్తూ ఉండండి” అంటూ ఒక పిక్ షేర్ చేసాడు.ఈ పిక్ లో వరుణ్ చుట్టూ నిహారిక, సుస్మిత, శ్రీజ తో పాటు మరింత మంది ఆ ఫొటోలో కనిపిస్తున్నారు.

Telugu Cousins, Ghani, Niharika, Saiee Manjrekar, Shreeja, Susmita, Varun Tej, W

ఈ ఫొటోలో వరుణ్ మధ్యలో కూర్చుంటే అతడి చుట్టూ మహిళలు కూర్చోవడంతో ఈ పిక్ అందరి దృష్టిని ఆకర్షించింది.ఇక వరుణ్ సినిమాలు విషయానికి వస్తే.వరుణ్ తేజ్ ప్రెజెంట్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని సినిమా చేస్తున్నాడు.స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధూ ముద్ద నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇందులో వరుణ్ తేజ్ జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Cousins, Ghani, Niharika, Saiee Manjrekar, Shreeja, Susmita, Varun Tej, W

ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ ఎఫ్ 3 సినిమాలో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో వరుణ్ తో పాటు వెంకటేష్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలోనే ఈ సినిమ రిలీజ్ కాబోతుంది.ఇందులో వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube