తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొనడం జరిగింది.ఈ మేరకు శనివారం తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గాలలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో రైతులకు ఐదు గంటల కరెంటు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే డీకే శివకుమార్ మాటలను అనువాదం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చాలా అత్యుత్సాహంగా వ్యవహరించారు.
డీకే మాటలను తప్పుగా అనువదిస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై.కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.డీకే శివకుమార్ తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురాకపోయినా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం చేస్తారని రామ్మోహన్ అనువదించారు.ఒకటికి మూడుసార్లు సీఎంగా ప్రమాణం అనటంతో వికారాబాద్ కాంగ్రెస్ విజయ యాత్రలో గందరగోళం నెలకొంది.

దీంతో డీకే శివకుమార్ మధ్యలోనే ప్రసంగం ఆపేశారు.తప్పుగా అనువాదం చెబుతున్నారని వారించిన కాంగ్రెస్ నాయకులు ఎవరు పట్టించుకోలేదు.నవంబర్ 30వ తారీకు తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.డిసెంబర్ మూడవ తారీకు ఫలితాలు రాబోతున్నాయి.డిసెంబర్ 9వ తారీకు ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన రోజే కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపిస్తుందని.ఇచ్చిన సూపర్ సెక్స్ హామీలను.
అమలు చేస్తామని డీకే శివకుమార్ ప్రసంగించారు.ఈ వ్యాఖ్యలను అనువదిస్తున్నా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్.
డిసెంబర్ 9వ తారీకు సోనియాగాంధీ జన్మదినం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు ఆ రోజే.తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు.
అంటూ తప్పుగా అనువదించారు.దీంతో డీకే శివకుమార్ ప్రసంగం మధ్యలోనే ఆపేయడం జరిగింది.