రాజకీయాలలో అడుగుపెట్టిన షకీలా... తమిళనాడులో

సౌత్ ఇండియాలో శృంగార తారగా ఒక దశాబ్ద కాలం పాటు వెలుగు వెలిగిన నటి షకీలా.తెలుగునాడు నుంచి మలయాళంలో అడుగుపెట్టి అక్కడ స్టార్ హీరోలకి సైతం పోటీ ఇచ్చే రేంజ్ లో ఆమె సినిమాలు చేసింది.

 Shakeela Entry In Tamilnadu Politics, Tollywood, Kollywood, South Romantic Queen-TeluguStop.com

ఒకానొక దశలో కేరళలో షకీలా సినిమాలకి అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారంటే ఆమె కెరియర్ ఏ రేంజ్ లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు.అయితే తరువాత నీలి చిత్రాలపై నిషేధం విధించడంతో మెల్లగా ఆమె చరిష్మా తగ్గుతూ వచ్చింది.

అదే సమయంలో శృంగార చిత్రాలకి ఆమె కూడా పూర్తిగా దూరం అయ్యి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.అయితే ఇక్కడ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.

ఏదో అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది.అయితే ఈ మధ్య తమిళ్ టెలివిజన్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ షోలు చేస్తూ కొంత లైమ్ లైట్ లోకి వచ్చింది.

అలాగే ఆమె బయోపిక్ కూడా రేసేంట్ గా బాలీవుడ్ లో తెరకెక్కింది.దీంతో షకీలా మరల ఫామ్ లోకి వచ్చింది.

ఈ నేపధ్యంలో ఈమె ఇప్పుడు ఏకంగా తమిళనాడు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చింది.

తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ దక్షిణాది సినీ నటి షకీలా రాజకీయ ప్రవేశం చేశారు.

ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.ఈ మేరకు ఆ పార్టీ తమిళనాడుకు చెందిన మానవ హక్కుల విభాగం బాధ్యతల్లో ఆమె పనిచేయనున్నారు.

రీసెంట్ గా తమిళ్ టెలివిజన్ షోలో ఆమె పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అదే సమయంలో శృంగార తారగా కూడా కోలీవుడ్ లో ఇమేజ్ ఉండటంతో పాటు ఏపీలో కంటే తమిళనాడులో తనకు ఎక్కువ గౌరవం లభిస్తూ ఉండటంతో ఈమె అక్కడికి వెళ్లి సెటిల్ అయిపొయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube