ఆగస్టు నెలలో పుట్టారా.... అయితే మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

ఆగష్టు నెలలో జన్మించిన వారిలో సమయస్ఫూర్తి ప్రత్యేక లక్షణంగా ఉంటుంది.అలాగే వీరికి ముందు చూపు కూడా ఎక్కువగా ఉంటుంది.

 August Born People Astrology And Personality-TeluguStop.com

వీరు గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు.వీరికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది.

వీరు ప్రతి పనిలోనూ దైర్యంగా ముందుకు వెళతారు.వీరు అనుకున్న పనిని అనుకున్న విధంగా చేసే దాక నిద్రపోరు.

వీరికి ఆత్మ విశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది.వీరిని కొంచెం దురదృష్టవంతులు అని చెప్పవచ్చు.

వీరికి వచ్చే కష్టాలు కూడా సొంతంగానే వస్తాయి.వీరికి అవసరమైనప్పుడు చేతిలో ధనం లేకపోవటం వలన అనేక కష్టాలు,ఇబ్బందులు కలుగుతాయి.

కొన్ని సమయాలల్లో బయటి వారి చేత మాటలు పడ వలసి వస్తుంది.సమయానికి వీరి ఆలోచనలు కూడా పని చేయక ఇబ్బందులు పడతారు.వీరు ఎక్కువగా ఊహల్లో తేలి పోతూ పగటి కలలు కంటూ ఉంటారు.వీరికి కాస్త సోమరితనం ఉన్నా ఇతరులను ఎదిరించే విషయంలో కాస్త దైర్యం ఎక్కువగానే ఉంటుంది.

వీరికి లోక జ్ఞానం కూడా ఎక్కువగా ఉంటుంది.దైవాన్ని ఖచ్చితంగా నమ్ముతారు.

వీరికి జ్యోతిషంలోనూ, వేదాంతం లోనూ మంచి పట్టు ఉంటుంది.వీరి ప్రేమ చాలా లోతైనది.

తల్లిదండ్రులను, సోదరులను, స్నేహితులను చాలా గాఢంగా ప్రేమిస్తారు.వీరు చేసే వ్యాపారం పట్ల కూడా శ్రద్ధ చాలా ఎక్కువగానే ఉంటుంది.


ఆరోగ్యము : గుండె జబ్బులు, కంటి జబ్బులు, వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.

ధనము :సమయస్ఫూర్తి మరియు దూరదృష్టితో అలోచించి ధనాన్ని సమకుర్చుకుంటారు.

లక్కీ వారములు : ఆది, సోమ మరియు బుధ వారాలు.

లక్కీ కలర్ : ఆరెంజ్, ఆకుపచ్చ మరియు గోల్డ్ కలర్.

లక్కీ స్టోన్ : పసుపురంగు, పగడం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube