శివుడు మనకు మొత్తం 11 రూపాల్లో దర్శనం ఇస్తాడు.స్వామి వారు అలా దర్శనం ఇవ్వడాన్నే ఏకాదశ రుద్రులు అటారు.
అలాగే మన పురాణాల ప్రకారం ద్వాదశ రుద్రులు కూడా ఉన్నారు. శివోమహేశ్వరః శంభుః శ్రీకంఠో భవ ఈశ్వరః మహాదేవః పశుపతిః నీలకంఠో వృషధ్వజః పరమేశ ఇమే రుద్రా ఏకాదశ సమీరితాః అని శివతత్త్వ రత్నాకరం.
దీనిని బట్టి 1.శివుడు, 2.మహేశ్వరుడు 3.శంభుడు 4.శ్రీకంఠుడు 5.భవుడు 6.8.పశుపతి 9.నీలకంఠుడు 10.అనువారు ఏకాదశరుడుడు.10 వృపర్వతాడు శ్వరుడు, 7.మహాదేవుడు 11.పరమేశుడు.అలాగే మరొక పక్షము ననుసరించి.
1.అజుడు, 2.ఏకపాదుడు, 3.అహిర్బుధ్న్యుడు, 4.త్వష్ట, 5.రుద్రుడు, 6.హరుడు, 7.శంభుడు, 8.త్రయంభకుడు, 9.అపరాజితుడు, 10.ఈశానుడు మరియు 11.త్రిభువనుడు అనువారు ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు.ఇంకా కొన్ని మత భేదాలు ఉన్నాయి.వాటి ప్రకారం పై పేర్లలో కొన్నింటికి బదులు వృషాకపి, కపర్ది, శర్వుడు మొదలైన పేర్లు వినబడుతున్నాయి.
అలాగే ధాత, మిత్రుడు, అర్యముడు, శుక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పుమ్షుడు, సవిత, త్వష్ట, విష్ణువు… వీరిని ద్వాదశ రుద్రులు అంటారు.ఇవే కాకుండా జయంతుడు, భాస్కరుడు, భానుడు, ఆదిత్యుడు… ఇత్యాదిగా గల నామాలు పేర్కొనబడినవి.
మన హిందూ పురాణాల ప్రకారం ఆ పరమ శివుడిని ఎన్ని రూపాల్లో అయినా పూజించకోవచ్చు.ధ్యానించు కోవచ్చు.
ఈ స్వామి వారిని ఎలా పిలిచినా పలుకుతూ మన కోరికలను తీర్చేందుకు ఎప్పుడూ ముందుంటారు.కోరిన కోర్కెలు తీర్చే ఆ భోళా శంకరుడిని అందరూ ధ్యానిస్తుంటారు.