పెళ్లయినా బ్రహ్మచర్యం పాటించొచ్చట.. ఎలాగో తెలుసా?

మనకు తెలిసినంత వరకు పెళ్లి చేసుకోకుండా ఉండటమే బ్రహ్మచర్యం అనుకుంటాం.అంటే శారీరక సుఖాలపై ఆశ లేకుండా వాటిని అనుభవించక పోవడమే బ్రహ్మచర్యం.

 Do You Know How To Get Brahmachari In Marriage, Brahmacharyam , Anjanya Swammy ,-TeluguStop.com

అయితే పెళ్లి చేసుకున్న వాళ్లు భార్యతో కలిసి ఉంటున్నందున ఆయన బ్రహ్మచర్యం పొందే అవకాశం లేదని మన మంతా అనకుంటాం.కానీ ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచర్యం పొందాడు.

అలాగే పెళ్లి అయి భార్యతో శారీరక సంబంధం కల్గి ఉన్నప్పటికీ.బ్రహ్మచర్యం పొంద వచ్చని పలువురు పండితులు చెబుతున్నారు.

అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పెళ్లి చేసుకున్న భార్యను తగిన విధాలుగా సుఖ పెట్టడం మంచి భర్త లక్షణం.

అయితే పరాయి స్త్రీలను మనసులో ఉంచుకోకుండా భార్యతోనే గడపాలి.మహిళలకు ప్రకృతి సిద్ధమైన 16 రోజులూ శృంగారం నిషేధం.

అనగా రజస్వలకు ముందు, వెనుక రోజులతో పాటు మొదటి 4 రాత్రులూ అలాగే 11, 13వ రాత్రులు తప్ప మిగిలిన 10 రాత్రులూ భార్యతో కలిసేందుకు శుభ ప్రదమైనవి.అమావాస్య, పౌర్ణమి రాత్రుల యందు నిషేధం.

అయితే అమావాస్య, పౌర్ణమి రాత్రుల్లో భార్యకు దూరంగా ఉంటే బ్రహ్మ  చర్య వ్రతాన్ని పాటించి నంత పుణ్యం దక్కు తుందట.అంటే ఆ రెండు రోజులు భార్యతో కలవకుండా ఉండటమే కాకుండా అలాంటి ఆలోచనలను కూడా మన మనస్సులోకి రానివ్వక పోతే బ్రహ్మచర్యం పాటించినట్లేనని పలువురు పండితులు వివరిస్తున్నారు.

అయితే ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకున్నప్పటికీ… సువర్చలా దేవిని తనలో లీనం చేసుకున్నాడు.అలా ఆంజనేయ స్వామి పెళ్లయినప్పటికీ బ్రహ్మచారిగా మారాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube