డ్రీమ్ సైన్స్ ప్రకారం మనం నిద్రిస్తున్నప్పుడు కలలలో ఏది చూసినా వాటి వెనుక ఏదో ఒక సంకేతం దాగి ఉంటుంది.దాని వెనుక మన మన జీవితానికి లోతైన సంబంధం ఏదో ఒకటి ఉంటుంది.
కొన్ని కలలు మనకు రాబోయే బంగారు రోజులకు ప్రతీక.కొన్ని హెచ్చరికలను సూచిస్తాయి.
లేదా అశుభం లేదా ప్రతికూలతను తెలియ జేస్తాయి.మనకు కలలో బిచ్చగాడు కనిపిస్తే లేదా మనమే స్వయంగా అడుక్కోవడం లాంటివి కనిపిస్తే, దాని అర్థం ఏమిటి? ఇలాంటి కలలన్నింటి గురించి స్వప్న శాస్త్రం ఏమి చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.కలలో బిచ్చగాడిని చూడడం: మీ కలలో ఎవరైనా అడుక్కోవడం లేదా ఎవరికైనా భిక్ష పెడుతుండటం లాంటివి మీరు చూస్తే అది మీ భవిష్యత్తు శ్రేయస్సును చూపుతుంది.సమీప భవిష్యత్తులో మీరు కొంత పెద్ద ఆస్తిని పొందబోతున్నారు మరియు దాని నుండి మీ స్నేహితులు లేదా బంధువులకు సహాయం చేయవచ్చు అని దాని అర్థం బిచ్చగాడిని విస్మరించడం: మీరు బిచ్చ గాడిని విస్మరించినట్లు కలలుగన్నట్లయితే మీరు సామాజిక వాతావరణంలో అనుకూల ఫలితాలను పొందబోతున్నారనే దానికి అది సంకేతం కావచ్చు.
ఈ కల మీ వ్యక్తిగత జీవితంలో చేసిన పనిని చూపుతుంది. బిచ్చగాళ్ల గుంపు కనిపించడం: మీకు మీ కలలో ఏదో ఒక ప్రదేశంలో చాలా మంది బిచ్చగాళ్ళు కనిపిస్తే, మీరు నిరాశ్రయులైన వారికి సహాయం చేయాలనే సంకేతం కావచ్చు.మీరు మీ సామర్థ్యాన్ని బట్టి వారికి సహాయం చేయ గలుగుతారు.వృద్ధుడికి లేదా పిల్లలకు భిక్ష పెట్టడం: కలలో మీరు యాచకునికి, వృద్ధుడికి లేదా పిల్లలకు సహాయం చేస్తుంటే, రాబోయే రోజులో ఏదో మార్పు జరగబోతున్నదని దాని అర్థం.ప్రస్తుతం మీరు ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లయితే, ఇటు వంటి రోజులు ముగియ బోతున్నాయని అర్థం చేసుకోండి మరియు మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, మీరు త్వరలో వ్యాధి నుండి బయటపడబోతున్నారని అర్థం చేసుకోండి.
స్వయంగా అడుక్కోవడం: కలలో మీరు అడుక్కోవడం, లేదా భిక్షాటన చేయడం లేదా ఎవరైనా మీకు డబ్బు లేదా బట్టలు ఇవ్వడం లాంటివి కనిపిస్తే, అది శుభానికి సంకేతం.మీ జీవితంలో ఏవో పెద్ద మార్పులు జరగబోతున్నాయని ఇది సూచిస్తుంది.ఆనందం, శ్రేయస్సు, గౌరవం పొంద బోతున్నారని స్వప్న శాస్త్రం చెబుతోంది.